Read more!

అయోధ్యతోపాటు ప్రారంభం కానున్న ప్రముఖ హిందూ ఆలయాలు ఇవే.. ప్రత్యేకతలు తెలుసుకోండి!

 

అయోధ్యతోపాటు ప్రారంభం కానున్న ప్రముఖ హిందూ ఆలయాలు ఇవే.. ప్రత్యేకతలు తెలుసుకోండి!

భారతదేశం...విభిన్న రకాల సంస్కృతులు,ఆచారాలకు పుట్టినిల్లు. దేశంలో చాలా ప్రాంతాలకు ప్రత్యేకంగా నిలిచే దేవాలయాలు ఉన్నాయి. ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు ఇక్కడికి తరలివస్తుంటారు. రానున్న కొత్త ఏడాదిలో కొన్ని ప్రముఖ ఆలయాల నిర్మాణం పూర్తి కానుంది. ఇంకొన్ని ప్రముఖ దేవాలయాల కీలక పనులు పూర్తి కానున్నాయి. ఈ పవిత్ర నిర్మాణాలు భారతదేశ గొప్ప దేవాలయాల నిర్మాణ అద్భుతాలు, సంస్కృతిక గొప్పతనాన్ని తెలియజేస్తాయి. 2024లో అందుబాటులోకి రానున్న దేవాలయాలు, వాటి ప్రత్యేకత గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

అయోధ్య రామ మందిరం:

2024 జనవరిలో అయోధ్య రామమందిరం ప్రారంభం కానుంది. శ్రీరాముని జన్మస్థలమైన అయోధ్య అపారమైన ఆధ్యాత్మిక, సాంస్క్రుతిక ప్రాముఖ్యత కలిగి ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రామమందిర మహా సంప్రోక్షణ 2024జనవరి 22న జరుగుతుంది. ఈ వేడుకకు క్రికెటర్లు, పారిశ్రామికవేత్తలు, నటులు, కరసేవకులు సహ ప్రముఖులు హాజరువుతారు. రామ్ లల్లా విగ్రహాన్ని ప్రధాని మోదీ ప్రతిష్టించనున్నారు. ఈ ఆలయానికి 2020 ఆగస్టు 5న మోదీ శంకుస్థాపన చేశారు.

శ్రీ శ్రీ రుక్మిణీ ద్వారకాధీశ్ మందిర్ :

2024మేలో ఇస్కార్ ద్వారక, ఢిల్లీలోని శ్రీశ్రీ రుక్మిణీ ద్వారకాధీ్ ఆలయాన్ని ఆవిష్కరించనుంది. ఈ ఆలయం రెండు ఎకరాల విస్తీర్ణంలో ఉంది. సమాజవ్రద్ధి, శ్రేయస్సు పెంపొందించడం లక్ష్యంగా ఈ ఆలయ నిర్మాణం జరుగుతోంది. త్వరలో అందుబాటులోకి రానున్న సెంటర్ ఫర్ పర్మనెంట్ హ్యాపీనెస్ లో రోజు కు లక్ష మందికి భోజనం అందించే వంటగది, విలువ ఆధారిత విద్యకోసం తరగతి గదులు,పదివేల మందికి పైగా ధ్యానం చేసుకునే మంది ఉంటుంది.

 శ్రీ జగన్నాథ్ పూరి హెరిటేజ్ కారిడార్:

2024జనవరి 17న పూరి హెరిటేజ్ కారిడార్ ప్రారంభం కానుంది. ఒడిశాలోని ప్రముఖ జగన్నాథ దేవాలయం చుట్టూ ఒక రూపాంతర ప్రాజెక్ట్ ఇది. దీని ఖర్చు రూ. 943 కోట్లు. ఈ  కారిడార్ తో 1.5కిమి శ్రీమందిర్ పరిక్రమ ఆలయ పరిసరాలను అందంగా మార్చుతారు. దీని ప్రారంభోత్సవానికి ప్రముఖ వ్యక్తులు హాజరు కానున్నారు. ఇది ఒడిశా ఆధ్యాత్మిక, సాంస్క్రుతిక చరిత్రలో ఒక ముఖ్యమైన దశ. సీఎం నవీన్ పట్నాయక్ 2021 నవంబర్ లో శంకుస్థాపన చేశారు.

శ్రీ మాయాపూర్ చంద్రోదయ మందిర్:

పశ్చిమ బెంగాల్లో నిర్మాణంలో ఉన్న శ్రీ మాయాపూర్ చంద్రోదయ మందిర్ లేదా టెంపుల్ ఆఫ్ ద వేద ప్లానిటోరియం 113 మీటర్ల ఎత్తులో ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం కానుంది. రాధా హధవాకు దీన్ని అంకితం చేశారు. ఇది పదివేల మందికి  వసతి కల్పిస్తుంది. ప్రపంచంలోని అతిపెద్ద గోపురాల్లో ఇది ఒకటి. 2010లో నిర్మాణం ప్రారంభమైంది. ఇప్పుడు పూర్తయ్యే దశకు చేరుకుంది. కోల్ కతా నుంచి 80 మైళ్ల దూరంలో ఈ ఆలయం ఉంది.