రాధా అష్టమి ఎప్పుడు...రాధాదేవిని ఎలా పూజించాలంటే..!
రాధా అష్టమి ఎప్పుడు...రాధాదేవిని ఎలా పూజించాలంటే..!
హిందూ మతంలో రాధా అష్టమికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ పవిత్ర పండుగను ప్రతి సంవత్సరం భాద్రపద మాసం శుక్ల పక్ష అష్టమి తేదీన జరుపుకుంటారు. శ్రీ రాధా రాణి ఈ రోజున జన్మించిందని నమ్ముతారు, కాబట్టి ఈ రోజు ఆమెకు అంకితం చేయబడింది. రాధా అష్టమిని రాధా జయంతి అని కూడా అంటారు. ఈ సందర్భంగా, రాధా రాణి మరియు శ్రీ కృష్ణుడిని భక్తితో పూజించడం ద్వారా, భక్తుడు అద్భుతమైన ఫలితాలను పొందుతాడు. రాధా జీ ఆశీస్సులు పొందడం ద్వారా, జీవితంలోని అన్ని కష్టాలు తొలగిపోయి ఆధ్యాత్మిక పురోగతి సాధిస్తారు.
అష్టమి తిథి ఎప్పుడంటే..
అష్టమి తిథి 30 ఆగస్టు 2025, 10:46 PMకు ప్రారంభం అవుతుంది.
అష్టమి తిథి సమాప్తం - 1 సెప్టెంబర్ 2025, 12:57 AM కు ముగుస్తుంది.
మధ్యాహ్న పూజ సమయం.. 31వ తేదీ ఉదయం 11:00 నుండి మధ్యాహ్నం 1:38 వరకు (వ్యవధి 2 గంటల 33 నిమిషాలు)
సంధ్యా ముహూర్తం - సాయంత్రం 6:44 నుండి 7:06 వరకు.
నిశిత ముహూర్తం - (31)రాత్రి 11:59 నుండి 12:44 వరకు (సెప్టెంబర్ 1)
పూజా సామగ్రి..
పువ్వులు, దండలు లేదా కట్టిన పువ్వుల మాల.
బియ్యం,
గంధపు చెక్క,
సింధూరం,
పండ్లు,
పాయసం,
చేసుకోవాలి అనుకునేవారు రాధా రాణి విగ్రహానికి అలంకరణ చేసుకోవచ్చు.
సుగంధ ద్రవ్యాలు,
దేశీ నెయ్యి దీపం కోసం,
అభిషేకానికి పంచామృతం.
పూజ విధి..
ఉదయం స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించాలి.
స్థలాన్ని శుభ్రం చేసి వేదికను ఏర్పాటు చేసి దానిపై రాధా రాణి విగ్రహం లేదా చిత్రాన్ని ఉంచాలి.
రాధారాణి విగ్రహం ఉంచితే అందమైన దుస్తులు, ఆభరణాలు అలంకరించాలి.
రాధారాణికి షోడశోపాచార పద్ధతిలో పూజను నిర్వహించాలి.
రాధా రాణి మంత్రాలను జపించాలి. రాధారాణి కథను పఠించడం లేదా వినడం ఎంతో మంచిది.
చివరగా నైవేద్యం అర్పించి హారతి ఇచ్చి కుంకుమ సమర్పించాలి.
రాధారాణిని ఎందుకు పూజించాలి?
రాధారాణిని ప్రేమకు ప్రతిరూపంగా భావిస్తారు. రాధారాణిని పూజిస్తే ఆమె అనుగ్రహం వల్ల జీవితంలో ప్రేమ, అభిమానం, ఆప్యాయత మెండుగా లభిస్తాయని చెబుతారు. రాధారాణి ప్రేమ అనంతం.. ఆమెకు ప్రేమను ఇవ్వడమే తెలుసు. ముఖ్యంగా శ్రీకృష్ణుడి అనుగ్రహం పొందాలంటే రాధారాణి అనుగ్రహం పొందడం ఉత్తమ మార్గమని చెబుతారు. రాధారాణి గురించి విన్నా, రాధారాణిని ధ్యానించినా, ఆమెను పూజించినా జీవితంలో సంతోషం వస్తుందని చెబుతారు.
*రూపశ్రీ.