మొదటిసారి రాధ అష్టమి చేసుకునేవారు.. ఈ నియమాలు తెలుసుకోవాలి..!
మొదటిసారి రాధ అష్టమి చేసుకునేవారు.. ఈ నియమాలు తెలుసుకోవాలి..!
హిందూ సంప్రదాయంలో చాలా దేవతల జన్మదినోత్సవాల సందర్భంగా గొప్పగా వేడుకలు జరుగుతాయి. వాటిలో శ్రీకృష్ణాష్టమి చాలా ముఖ్యమైనది. శ్రీకృష్ణుడికి ఎంతో ప్రియమైనది రాధాదేవి. రాధాదేవిని ప్రేమ స్వరూపంగా బావిస్తారు. రాధాదేవిని పూజిస్తే శ్రీకృష్ణుడి అనుగ్రహం తొందరగా లభిస్తుందని కూడా చెబుతారు. సాధారణంగా తెలుగు రాష్ట్రాలలో కృష్ణాష్టమి, వేడుకలు జరపడం తక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అలాంటిది ఇక రాధ అష్టమి పూజ చాలామందికి తెలియదు కూడా. కానీ అన్నీ తెలుసుకుని ఆచరిస్తున్నవారు ఇప్పట్లో ఉన్నారు. మొదటిసారి రాధ అష్టమి చేసుకునే వారు కొన్ని నియమాలు తెలుసుకోవాలి. అవేంటంటే..
రాధ అష్టమి నియమాలు..
రాధా అష్టమి రోజున చేసే ఉపవాసం ఫలవంతంగా ఉండాలంటే కొన్ని ప్రత్యేక విషయాలను గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం.
ఉపవాసం ఉన్న రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి, స్నానం చేసి, ఇంటిని, ప్రాంగణాన్ని పూర్తిగా శుభ్రం చేయాలి.
ఈ రోజున కోపం తెచ్చుకోవడం, చెడుగా మాట్లాడటం లేదా పెద్దలను అవమానించడం మానుకోవాలి.
ఉపవాస సమయంలో తృణధాన్యాలు, ఉప్పు తినకూడదు. రోజుకు ఒకసారి మాత్రమే పండ్లు తినాలి.
ఉపవాసం పూర్తిగా పాటించలేని వారు ఈ రోజున మాంసం, మద్యం, ఉల్లిపాయ, వెల్లుల్లి వంటి తామసిక ఆహారానికి దూరంగా ఉండాలి.
ఈ నియమాలను పాటించడం ద్వారా, ఉపవాసం, ఆరాధన పద్దతి పూర్తవుతుంది. రాధా రాణి ఆశీర్వాదాలు లభిస్తాయి.
రాధా అష్టమి నాడు ఏమి చేయాలి?
రాధా-కృష్ణులను జంటగా సరైన పద్ధతిలో పూజించి వారి ఆశీస్సులు పొందాలి.
రాధా రాణి విగ్రహాన్ని లేదా చిత్రాన్ని చక్కని పూలతో అలంకరించాలి. రాధాకృష్ణులకు అందమైన, కొత్త బట్టలు, ఆభరణాలతో అలంకరించాలి.
తీపి పూరీ, స్వీట్లు, పాయసం, తాజా పండ్లు నైవేద్యంగా ఉంచాలి.
రాధాకృష్ణులకు ఆహారం నివేదించేటప్పుడు “త్వదీయం వస్తు గోవింద్ తుభ్యమేవ్ సమర్పయే, గృహాన్ సమ్మో భూత్వా ప్రసిద్ధ్ పరమేశ్వర్” అనే మంత్రాన్ని జపించాలి.
ఈ మంత్రంతో పెట్టే నైవేద్యం త్వరగా అంగీకరిస్తారని, రాధాకృష్ణుల అనుగ్రహం లభిస్తుందని చెబుతారు.
పూజ చేసేటప్పుడు మనస్సును ఏకాగ్రతతో ఉంచి భక్తితో పూజించాలి.
రాధా అష్టమి రోజున చేసే పూజ వల్ల ప్రేమ, అదృష్టం, ఆధ్యాత్మిక ఆనందం కలుగుతాయి.
పూజ తర్వాత హారతి చేసి, భజన కీర్తనలో పాల్గొనాలి.
రోజంతా స్వచ్ఛమైన, సాత్వికమైన ఆహారాన్ని తీసుకోవాల. పండ్లు తినాలి.
*రూపశ్రీ.