నోరు లేని జీవులను హింసిస్తే గరుడ పురాణంలో ఉన్న శిక్షలు ఏమిటి!
నోరు లేని జీవులను హింసిస్తే గరుడ పురాణంలో ఉన్న శిక్షలు ఏమిటి!
సనాతన ధర్మంలోని 18 పురాణాలలో గరుడ పురాణం ఒకటి. మనిషి చేసే పనులకు తగ్గట్టు వాటి పర్యవసానాలు ఎలా ఉంటాయి? ఎలాంటి ఫలితం ఉంటుంది అనే విషయాన్ని గరుణ పురాణంలో వివరించారు. జీవితానని ధర్మబద్దంగా ఎలా గడాపాలి అనే విషయాలు తెలియజేయమే కాకుండా.. మనిషి చేసిన పనులకు యమలోకంలో ఎలాంటి శిక్షలు ఉంటాయనే విషయాన్ని కూడా తెలుపుతుంది. స్వార్థం, కోరిక లేదా క్రూరత్వం కారణంగా మూగ జీవులకు హింసిస్తే.. అలాంటి వారికి గరుడ పురాణం ప్రకారం కఠినమైన శిక్షలు ఉంటాయి. గరుడ పురాణం ప్రకారం, మూగ జీవులను హింసించే వారు యమలోకంలో భయంకరమైన శిక్షలను ఎదుర్కొంటారు. అందుకే జంతువులకు హాని చేయకూడదని చెబుతారు. జంతువులను హింసించే వారికి గరుడ పురాణం ప్రకారం ఎలాంటి శిక్షలు ఉంటాయో తెలుసుకుంటే..
ఆహారం కోసం..
రుచి కోసం లేదా జంతువులను బలి ఇస్తే సంపద వస్తుందని అనుకుని అమాయక జంతువులను బలి ఇచ్చేవారు లేదా చంపేవారు తమిస్ర నరకానికి గురవుతారట. ఇక్కడ చీకటి గదులలో ఉంచుతారు. ఆ తరువాత యమ దూతలు వేడి ఇనుప రాడ్లతో కొట్టి ఆత్మ అశక్తమయ్యే వరకు కొడతారు. ఈ శిక్ష ఆత్మకు అది కలిగించిన వేదనను గుర్తు చేయడానికి వేయబడుతుందట.
పక్షుల పట్ల క్రూరత్వం..
పక్షులను వేటాడే లేదా చిన్న జీవులను కారణం లేకుండా వేధించే మానవులను కాకోలుకియ నరకంలో ఉంచుతారు. ఇక్కడ శిక్ష భయంకరమైనది. భయంకరమైన పెద్ద కాకులు, రాబందులు, గుడ్లగూబలు తమ గోళ్లు, ముక్కులతో పాపాత్ముడి శరీరాన్ని నిర్విరామంగా కొరుకుతాయి.
జలచరాలను చంపడం..
చేపలు, తాబేళ్లు లేదా ఇతర జలచరాలకు అనవసరంగా హాని చేసేవారికి, క్రిమిభోజ్య అనే నరకం ఉంది. ఇక్కడ పాపిని పురుగులు నిండిన చెరువులోకి విసిరివేస్తారు. అక్కడ వేలాది విష కీటకాలు, జీవులు ఆత్మ శరీరాన్ని కొరుకుతాయి. ఈ వేదన భరించలేనిది, కానీ వారి చర్యల పరిణామాలు ఎదుర్కొనే వరకు ఆత్మ విముక్తి పొందదు.
గోవధ, పెంపుడు జంతువుల ద్రోహం..
సనాతన ధర్మంలో ఆవును తల్లిగా భావిస్తారు. గరుడ పురాణం ప్రకారం, ఎవరైనా ఆవును వధిస్తే లేదా పెంపుడు జంతువులైన కుక్క లేదా పిల్లి వంటి వాటిని చంపితే వారిని శూలప్రోత అని పిలువబడే నరకానికి పంపుతారు. ఇక్కడ ఆత్మ పదే పదే పదునైన ఇనుప ఈటెలపై వేలాడదీయబడుతుంది.
క్రూరత్వం..
అత్యంత హింసాత్మకంగా, క్రూరంగా ఉండి జీవులను హింసిస్తూ చంపడంలో ఆనందాన్ని పొందే వారికి మహాపచక నరకం ఉంది. మహాపచక నరకంలోఆత్మ మండుతున్న మంటల్లోకి విసిరివేయబడుతుంది. ఇక్కడ అగ్ని ఎంతగా ఉంటుందంటే ఆత్మ నిరంతరం మండుతుంది కానీ పూర్తీగా దహించబడదు. దాని వలన అది తన పాపాలకు శిక్షను చాలా కాలం పాటు అనుభవించగలుగుతుంది.
*రూపశ్రీ.