వివాహ దీక్ష

 

పెళ్లంటే... చాలామంది అదొక వేడుకగా మాత్రమే చూస్తారు. కానీ నిజానిికి పెళ్లంటే ఓ క్రతువు. ఓ యజ్ఙం, ఓ సంస్కారం. పెళ్లిలో వినిపించే వేదమత్రాలు జీవన నిర్దేశికాలు. రామాయణ సారం మొత్తం మన వివాహ సంస్కృతిలో కనిపిస్తుంది. అందుకే హిందూ వివాహం ఓ అద్భుతం.  

పెళ్లి కూతుర్ని చేయడం, పెళ్లి కొడుకును చేయడం అనేది... బంధువర్గాన్ని బట్టి రోజుల కొద్దీ జరిగే తంతు. ఆ తర్వాత పెళ్లి రోజు రానే వస్తుంది. పెళ్లి కొడుకు ఆడపిల్ల వారి విడిది ఇంట్లో దిగుతాడు. అక్కడ్నుంచి పెళ్లి పీటలు ఎక్కేలోపు కొన్ని ప్రధాన కార్యక్రమాలుంటాయ్.  సీతారామకల్యాణాన్ని తలపించే తంతులవి. వాటి గురించి తెలుసుకోవాలంటే... ఈ వీడియో చూడండి. హిందూ వివాహ గొప్పతనాన్ని తెలుసుకోండి.