పెళ్లికూతుర్ని చేసే విధానం

 

పెళ్లికూతుర్ని చేసే విధానం...!

 

 

సక్రమమైన జీవితాల్లో ఒకేసారి జరిగే ముచ్చట పెళ్లి. గణనాధుని పూజతో పెళ్లి తంతుకు శ్రీకారం చుట్టాక... ప్రాంతీయ ఆచారాలకు అనుగుణంగా పెద్దలు కొన్ని పనులు చేస్తారు. వాటిల్లో శుభలేఖల పంపకం కూడా ఒకటి. అవన్నీ... గత వీడియోలో తెలుసుకున్నాం. ఇక దాని తర్వాత జరగాల్సిన ప్రధాన ఘట్టం... అమ్మాయినీ, అబ్బాయినీ.. పెళ్లికి ముస్తాబు చేయడం. అంటే... పెళ్లి కూతురిగా అమ్మాయిని, పెళ్లి కొడుకుగా అబ్బాయిని అలంకరించడం. ఇదొక గొప్ప ప్రక్రియ. 

ఇందులో అంతర్లీనంగా ఎన్నో అంతరార్థాలు దాగుంటాయ్. శాస్త్ర పరంగానే కాదు.. శాస్త్రీయ పరంగా కూడా ఎన్నో ఆసక్తికరమైన అంశాలు.. ఇందులో ముడిపడి ఉంటాయ్. హిందూ ధర్మం ప్రకారం. పెళ్లి కొడుకంటే... శ్రీనివాసుడే. మరి పెళ్లి కూతురు... సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి. మరి వారిని ఏ విధంగా అలంకరిస్తారు? కాబోయే దంపతులను పెళ్లికి ఎలా సిద్ధం చేస్తారు? ఈ కార్యక్రమంలో ఏ విధమైన నియమాలను పాటిస్తారు? తెలుసుకోవాలనుందా? అయితే... ఈ వీడియో చూసేయండి.