Read more!

అన్నింటినీ మించిన అలంకారము

 

 

 

అన్నింటినీ మించిన అలంకారము

 

 

 

ఐశ్వర్యస్య విభూషణం సుజనతా శౌర్యస్య వాక్సంయమో

జ్ఞాన స్యోపశమః శ్రుతస్య వినయో విత్తస్య పాత్రే వ్యయః ।

అక్రోధ స్తపసః క్షమా ప్రభవితుర్ధర్మస్య నిర్వ్యాజతా

సర్వేషామపి సర్వ కారణమిదం శీలం పరం భూషణమ్‌ ॥

సంపదకు మంచినడవడే అలంకారము, శౌర్యానికి మితభాషణమే అలంకారము, జ్ఞానానికి శాంతి, శాస్త్రపాండిత్యానికి వినయము, ధనానికి దానము, తపస్సుకి క్రోధం లేని తత్వము, సామర్ధ్యానికి క్షమ అలంకారములు. అన్నింటికీ మించిన అలంకారము ఉన్నతమైన వ్యక్తిత్వమే!