Read more!

సందేహమే వద్దు

 

 

సందేహమే వద్దు

 

 

ఇందుగలడందు లేడని

సందేహము వలదు చక్రి సర్వోపగతుం

డెందెందు వెదకి జూచిన

నందందే గలడు దానవాగ్రణి వింటే!

భగవంతుడు సర్వవ్యాపి అని చెప్పడంలోనే హైందవ ధర్మంలో పరిపక్వత కనిపిస్తుంది. ఆయన సర్వవ్యాపి కాబట్టి విష్ణుమూర్తిలాగా పాలకడలి మీదా ఉండవచ్చు, నరసింహస్వామిలాగా స్తంభాన్ని బద్దలుకొట్టుకునీ రావచ్చు. అలాంటి సందర్భంలో పోతన భాగవతంలో రాసినదే పైన పేర్కొన్న పద్యం. భగవంతుడు సర్వవ్యాపి కాబట్టి మనిషి వెలుపలే కాదు... లోపల కూడా ఉంటాడనే ఉపనిషత్‌ స్ఫూర్తిని కూడా ఈ పద్యం గుర్తుచేస్తుంటుంది.