Read more!

ఇంద్రుడికి సైతం తప్పలేదుగా!

 

ఇంద్రుడికి సైతం తప్పలేదుగా!

 

 

నేతా యస్య బృహస్పతిః ప్రహరణం వజ్రం సురాః సైనికాః

స్వర్గో దుర్గమనుగ్రహః ఖలు హరే రైరావణో వారణః ।

ఇత్యాశ్చర్య బలాన్వితోఽపి బలభిద్భగ్నః పరైః సంగరే

తద్వ్యక్తం నను దైవమేవ శరణం ధిగ్ధిగ్వృథా పౌరుషమ్‌ ॥

 

ఇంద్రునికి సాక్షాత్తు ఆ బృహస్పతి గురువుగా ఉన్నాడు, వజ్రాయుధం అతనికి తోడుగా ఉంది, దేవతలే అతని తరపున పోరాడేందుకు సిద్ధంగా ఉన్నారు, స్వర్గమే అతనికి కోటగా నిలిచింది, ఐరావతం తన వాహనంగా ఉంది, ఆఖరికి ఆ హరి అండదండలు కూడా ఉన్నాయి... అయినా రాక్షసులతో జరిగిన యుద్ధాలలో అతను ఓడిపోయాడు కదా! విధి ఒకోసారి ఎంత బలీయంగా ఉంటుందో దీనిబట్టే అర్థమైపోతోంది. కాబట్టి మన కర్తవ్యాన్ని మనం నిర్వహించి, ఆపై ఫలితపు భారాన్ని ఆ భగవంతుని మీద విడవడం మంచిది.