పత్రీజీ ధ్యాన మహాయాగంలో 4వ రోజు వేద పఠనం
పత్రీజీ ధ్యాన మహాయాగంలో 4వ రోజు వేద పఠనం
రంగారెడ్డి జిల్లా కడ్తాల్ లోని కైలాసపురి మహేశ్వర మహా పిరమిడ్ లో పత్రీజీ ధ్యాన మహా యాగం కార్యక్రమంలో ప్రతిరోజు నిర్వహిస్తున్న ట్రాత్ ఫర్ యూత్( Turth for youth) అనే కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది ఇందులో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు, మోటివేషనల్ స్పీకర్లు పాల్గొని తమ సందేశాల ద్వారా యువతకు అధ్బుతమైన ఆత్మజ్ఞానాన్ని అందిస్తున్నారు. పత్రీజీ ధ్యాన మహా యాగం నాలుగో రోజు డిసెంబర్ 24న నిర్వహించిన కార్యక్రమంలో ధ్యాన ఉస్మానియా ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఓయూ రాము పాల్గొని మాట్లాడారు. బ్రహ్మర్షి పత్రీజీ అత్యంత సులువుగా ఆత్మజ్ఞానాన్ని అతి సామాన్యులకు కూడా అందించిన గొప్ప గురువు అని కొనియాడారు. మన ఆలోచనలే అన్నింటికి మూలమని తెలియజేసారు. తాను ధ్యాన మార్గంలోకి ఎప్పుడు వచ్చారు, ఎందుకు వచ్చారు అనే విషయాలను తెలియజేసారు. అనంతరం బుద్ద సీఈవో క్వాంటమ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు చంద్రశేఖర్ మాట్లాడుతూ మన ఆలోచనలే వాస్తవ రూపం దాలుస్తాయని తెలిపారు. సానుకూల ఆలోచనల ద్వారా ఏదై న సాధించవచ్చునని తెలియజేసారు. ధ్యాన సాధనతో మన జీవిత ధ్యేయం తెలుస్తుందన్నారు. యువత పరిమిత నమ్మకాలను వదిలిస్తే ఏదైన చేయగలరని సూచించారు. అనంతరం సీనియర్ పిరమిడ్ మాస్టర్ అంజయ్య మాట్లాడుతూ విద్యార్దులకు ఆత్మవిద్యయే అసలైన విద్యఅని. విద్యావ్యవస్థలోకి ఆధ్యాత్మిక శాస్త్రాన్ని తీసురావాలని బ్రహ్మర్షి పత్రీజీ చెప్పేవారని గుర్తుచేసారు. అనంతరం మోటివేషనల్ స్పీకర్ ఆనంద్ రెడ్డి మాట్లాడుతూ మనిషి విజయం సాధించాలంటే ఏమీ చేయాలి? ఎలాంటి క్వాలిటీస్ ఉండాలని అనే విషయాల గురించి అధ్బుతంగా వివరించి. ధ్యానులు,యువతకు చక్కటి జ్ఞానాన్ని అందించారు.
లక్షలాది ప్రజలు, ధ్యానుల మధ్య రంగారెడ్డి జిల్లా కడ్తాల్ లోని కైలాసపురి మహేశ్వర మహా పిరమిడ్ లో పత్రీజీ ధ్యాన మహా యాగం అత్యంత కోలాహాలంగా జరుగుతోంది. యాగంలో 4 వ రోజు డిసెంబర్ 24 న నిర్వహించిన పలు కార్యక్రమాలు అందిరనీ విశేషంగా అలరించాయి. ఈ కార్యక్రమాల్లో భాగంగా ప్రతి రోజు ఉదయం నిర్వహిస్తున్న యోగా, వేదపఠనం, సంగీత నాధ ధ్యానం కార్యక్రమాలు ధ్యానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. యోగా నిపుణులు వెంకటేశ్ యోగా ఆసనాలు, ముద్రలు, చక్రాలు గురించి అధ్బుతంగా వివరిస్తున్నారు .అలాగే చైతన్య, మాస్టర్ తేజాలు అధ్బుతంగా వేదపఠనం చేసి ధ్యానులకు అధ్బుతమైన వేద జ్ఞానాన్ని అందిస్తున్నారు. మరోవైపు మ్యూజిక్ డైరెక్టర్ సంజయ్ కింగ్ బృందం ప్రదర్శిస్తున్న సంగీత నాద ధ్యానం ధ్యానులను ఊర్రూతలూగిస్తుంది. ధ్యానులు, మాస్టర్లు ఎంతో ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ సందడి చేస్తున్నారు.
రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం లోని కైలాసపురి మహేశ్వర మహా పిరమిడ్ లో పత్రీజీ ధ్యాన మహా యాగం అధ్బుతంగా జరుగుతోంది. యాగంలో నాలుగో రోజు డిసెంబర్ 24న నిర్వహించిన కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల PSSM జిల్లా అధ్యక్షులు పాల్గొన్నారు. ఈసందర్బంగా తాము చేస్తున్న ధ్యాన, ఆత్మ జ్ఞాన కార్యక్రమాలు, అలాగే భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాల గురించి తెలియజేసారు. ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఎస్. హన్మంత్ రావు తమ బృందంతో పాల్గొని జిల్లాలో తాము చేస్తున్న కార్యక్రమాల గురించి వివరించారు. అలాగే నాగర్ కర్నూల్ సీనియర్ పిరమిడ్ మాస్టర్ తిరుపతియ్య. సిద్దిపేట సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఈశ్వరయ్య, కొనసీమ జిల్లా సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఎన్. విజయభాస్కర్ రెడ్డి, చిత్తూరు జిల్లా సీనియర్ పిరమిడ్ మాస్టర్ హరినాథ్ బాబులు తమ బృందాలతో పాల్గొని తమ జిల్లాలో ధ్యాన విస్తరణకు తాము చేస్తున్న, అలాగే చేపడుతున్న కార్యక్రమాల గురించి వివరించారు.
రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం లోని కైలాసపురి మహేశ్వర మహా పిరమిడ్ లో జరుగుతున్న పత్రీజీ ధ్యాన మహా యాగం లో 4 వరోజు డిసెంబర్ 24న మ్యానిఫెస్టేషన్ అనే అంశంపై నిర్వహించిన ప్యానెల్ డిస్కషన్ కార్యక్రమం అధ్బుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో బుద్ద సీఈవో క్వాంటమ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు చంద్రశేఖర్, శ్రేయన్స్ దాగా ఫౌండ్ వ్యవస్థాపకురాలు శ్రేయన్స్ దాగా, పిరమిడ్ వ్యాలీ ట్రస్టీ సాయి కృపా సాగర్, Pmc Hindi Director రామారాజు, అనువాదకురాలు స్వర్ణలత, లైఫ్ కోచ్ డెనిషా, సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీనివాస్ లు పాల్గొన్నారు. ఈ సందర్బంగా మ్యానిఫెస్టేషన్ అంటే ఏమీటి, మ్యానిఫెస్టేషన్ ఎలా చేయాలి, మ్యానిఫెస్టేషన్ ద్వారా మనం అనుకున్నది ఎలా సాధించాలి అనే విషయాల గురించి అధ్బుతంగా తెలియజేసి చక్కటి జ్ఞానాన్ని అందించారు.
రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం లోని కైలాసపురి మహేశ్వర మహా పిరమిడ్ లో జరుగుతున్న పత్రీజీ ధ్యానమహా యాగంలో నిర్వహిస్తున్న కల్చరల్ ప్రోగ్రామ్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. పత్రీజీ ధ్యానమహా యాగంలో 4 వరోజు డిసెంబర్ 24 నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో జనగామాకు చెందిన మైత్రేయ కూచిపూడి కళాక్షేత్రం సుఖేష్ బృందం ప్రదర్శించిన కూచిపూడి, భరతనాట్యం నృత్యాలు అందరినీ అలరించాయి. అలాగే విద్యార్దినులు చేసిన ఫోక్ డ్యాన్స్ ధ్యానులకు చక్కటి వినోదాన్ని అందించాయి. అనంతరం చిన్నారులు మార్షల్ ఆర్ట్స్ అధ్బుతంగా ప్రదర్శించి అందిరినీ ఆనందపరిచారు. ఆ తర్వాత జీ.కే బృందం కళాకారిణిలు అధ్బుతంగా ఆధ్యాత్మిక గీతాలను పాడి ధ్యానులను భక్తి సాగరంలో ఓలలాడించారు. తమ అధ్బుత ప్రదర్శనలతో అందరినీ అలరించిన చిన్నారులను, కళాకారులను పరిణిత పత్రీ, అలాగే మహేశ్వర మహా పిరమిడ్ ట్రస్టీ కూకట్ లక్ష్మీలు ఘనంగా సన్మానించారు.
రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం లోని కైలాసపురి మహేశ్వర మహా పిరమిడ్ లో జరుగుతున్న పత్రీజీ ధ్యానమహా యాగంలో ప్రముఖు వైద్యులు పాల్గొని సంపూర్ణ ఆర్యోగంపై చక్కటి సలహాలు, సూచనలు ఇస్తున్నారు. పత్రీజీ ధ్యానమహా యాగంలో 4వరోజు డిసెంబర్ 24న నిర్వహించిన Health and Spiritual Science కార్యక్రమంలో పంచగవ్య వైద్యులు గోమాత సురేష్ పాల్గొని సంపూర్ణ ఆరోగ్యం ఎలా పెంపొందించుకోవాలనే అనే విషయం గురించి అధ్బుతంగా వివరించారు. ఆరోగ్యమనేది మన చేతిలోనే ఉందని తెలిపారు. ఒత్తిడి, కర్మలు, సగం జ్ఞానం, శరీతత్వం తెలుసుకోకపోవడం, ఇతరులతో పోల్చుకోవడం, వ్యాధిని నిర్లక్ష్యం చేయడం వంటివి అనారోగ్యానికి కారణాలవుతున్నాయని వివరించారు. ఆనందంగా ఉండడం, వ్యాయమం చేయడం, సరైన ఆహారం తీసుకోవడం, ధ్యానం చేయడం, కృతజ్ఞతాభావం కలిగివుండడం, ప్రశాంతంగా ఉండడం వంటి వాటి వలన మంచి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని తెలియజేసారు.