పత్రీజీ ధ్యాన మహాయాగంలో 5వ రోజు వేద పఠనం
పత్రీజీ ధ్యాన మహాయాగంలో 5వ రోజు వేద పఠనం
అధ్బుతమైన కార్యక్రమాలతో కోట్లాది మందికి చేరుమైంది PMCచానెల్. అనేక ధ్యాన, జ్ఞాన కార్యక్రమాలను రూపొందించి ప్రపంచవ్యాప్తంగా ధ్యానాన్ని తీసుకెళ్లింది. ఇప్పుడు అందరికీ మరింత చేరువ అయ్యేందుకు ఓ యాప్ కు రూపకల్పన చేసింది PMC. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం లోని కైలాసపురి మహేశ్వర మహా పిరమిడ్ లో జరుగుతున్న పత్రీజీ ధ్యాన మహా యాగంలో PMC తెలుగు యాప్ ను డాక్టర్ న్యూటన్ కొండవీటి లాంచ్ చేసారు. అనంతరం ఆయన మాట్లాడుతూ PMC తెలుగు యాప్ అధ్బుతంగా ఉందని, సెల్ ఫోన్ లో ఈ యాప్ లో PMC ప్రోగ్రామ్స్ అన్నీ చూడవచ్చునని తెలిపారు. ఇది చాల గొప్పవిషయమని, ధ్యాన జగత్ కావాలంటే ఇలాంటి యాప్ కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో PMC మేనేజింగ్ డైరెక్టర్ ఆనంద్, అలాగే PMC హింది ఎండీ అలేఖ్య, సీఈవో అమూల్యలు పాల్గొని తమ సందేశాలు ఇచ్చారు.
రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం లోని కైలాసపురి మహేశ్వర మహా పిరమిడ్ లో జరుగుతున్న పత్రీజీ ధ్యాన మహా యాగం లో వివిధ అంశాలపై ప్యానెల్ డిస్కషన్ కార్యక్రమం అధ్బుతంగా జరుగుతోంది. పత్రీజీ ధ్యాన మహా యాగం లో 5వరోజు డిసెంబర్ 25న Relation Between Parents And kids ( తల్లిదండ్రులు, పిల్లల మధ్య సంబంధ బాంధవ్యాలు) అనే అంశంపై చర్చ జరిగింది. ఈ కార్యక్రమంలో మహేశ్వర మహాపిరమిడ్ ట్రస్టీ శ్రీరామ్ గోపాల్, డ్యాక్టర్ న్యూటన్, బాలవికాశ్ మహేశ్వరీ, డాక్టర్ జీ.కే పాల్గొని సందేశాన్ని ఇచ్చారు. ఈ సందర్బంగా బాలవికాశ్ మహేశ్వరీ మాట్లాడుతూ గతంలో ఉమ్మడి కుటుంబాలు ఉండేవని, దీని వలన కుటుంభ సభ్యులు మధ్య మంచి బంధాలు ఉండేవని తెలిపారు. ప్రస్తుతం బీజీ లైఫ్ లో తల్లిదండ్రులు పిల్లలతో ఎక్కువ సమయం గడపడంలేదని దీని వలన సమస్యలు వస్తున్నాయని తెలియజేసారు. అనంతరం డాక్టర్ జీ. కే మాట్లాడుతూ విద్యార్ధి దశ నుంచే విద్యార్దుకు ఆత్మవిద్యను బోధించాల్సిన అవసరం ఉందని తెలిపారు. డ్యాక్టర్ న్యూటన్ కొండవీటి మాట్లాడుతూ చిన్న తనం నుంచే పిల్లలకు ధ్యానం, శాకాహరం గురించి బోధించాలని తెలిపారు. పిల్లలకు ఏమీ కావాలో తల్లిదండ్రులు అర్ధం చేసుకొని అది వారికి అందివ్వాలని సూచించారు. అనంతరం ధ్యానులు అడిగిన ప్రశ్నలకు చక్కటి సమాధానాలు చెప్పి వారి సందేహాలను నివృత్తి చేసారు.
రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం లోని కైలాసపురి మహేశ్వర మహా పిరమిడ్ లో జరుగుతున్న పత్రీజీ ధ్యానమహా యాగంలో ప్రముఖు వైద్యులు పాల్గొని సంపూర్ణ ఆర్యోగంపై తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అధ్బతంగా వివరిస్తున్నారు . పత్రీజీ ధ్యానమహా యాగంలో 5 వరోజు డిసెంబర్ 25న నిర్వహించిన Health and Spiritual Science కార్యక్రమంలో ఆయుర్వేద డాక్టర్ రాంబాబు పాల్గొని సంపూర్ణ ఆరోగ్యం ఎలా పెంపొందించుకోవాలనే అనే విషయం గురించి చక్కగా వివరించారు. మన తీసుకునే ఆహారమే మనకు ఔషధంగా పనిచేయాలని సూచించారు. మనలో ప్రేమతత్వం, కృత్జజ్ఞాత భావం ఉంటే ఆరోగ్యంగా ఉంటామని తెలియజేసారు. అలాగే సరైన ఆహారం తీసుకోవడం,ప్రకృతిలో గడపడం, సామా బియ్యం, చిక్కుడు గియ్యలు లాంటివి తినడం వలన మంచి ఆరోగ్యంతో ఉంటామని తెలియజేసారు.
రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం లోని కైలాసపురి మహేశ్వర మహా పిరమిడ్ లో నిర్వహిస్తున్న పత్రీజీ ధ్యాన మహా యాగం అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఈ సందర్బంగా PSSM ప్రాజెక్టులపై ప్రదర్శిస్తున్న ఏవీలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. పత్రీజీ ధ్యాన మహా యాగంలో 5రోజు డిసెంబర్ 25న నిర్వహించిన కార్యక్రమంలో పిరమిడ్ స్పిరుచ్యువల్ ట్రస్ట్ హైదరాబాద్, PSSM ధ్యాన భాగ్యనగర్ ట్రస్ట్ ఏవీలను ప్రదర్శించారు. అనంతరం పిరమిడ్ స్పిరుచ్యువల్ ట్రస్ట్ హైదరాబాద్ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి, PMC ట్రస్ట్ చైర్మన్ దాట్ల హన్మంతరాజు, PMC executive director సేత్ బాలకృష్ణ, ట్రస్ట్ సభ్యులు పాల్గొని తమ సందేశాలు ఇచ్చారు.