పత్రీజీ ధ్యాన మహాయాగంలో 3వ రోజు వేద పఠనం
పత్రీజీ ధ్యాన మహాయాగంలో 3వ రోజు వేద పఠనం
రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం లోని కైలాసపురి మహేశ్వర మహా పిరమిడ్ లో దిగ్విజయంగా జరుగుతున్న పత్రీజీ ధ్యాన మహా యాగం లో వివిధ అంశాలపై నిర్వహిస్తున్న ప్యానెల్ డిస్కషన్ కార్యక్రమం అధ్బుతంగా కొనసాగుతొంది. పత్రీజీ ధ్యాన మహా యాగం లో 3 వరోజు డిసెంబర్ 23న నిర్వహించిన ప్యానెల్ డిస్కషన్ లో PMC Managing Director ఆనంద్, పిరమిడ్ స్పిరుచ్యువల్ ట్రస్ట్ హైదరాబాద్ చైర్మన్ విజయ భాస్కర్ రెడ్డి, సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఓయూ రాము, క్వాంటమ్ లైఫ్ యూనివర్శిటీ పవన్, గురుస్థాన్ వ్యవస్థాపకులు పేరం నాగేంద్ర పాల్గొని తమ సందేశాలు ఇచ్చారు. యువత దురలవాట్లకు బానిస అవుతుండడం పట్ల, చిన్న సమస్యలకే ఆత్మహత్యలకు పాల్పడుతుండడం పట్ల ఆందోళన వ్యక్తం చేసారు. భవిష్యత్తులో యువత కోసం మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. అలాగే తమ ధ్యాన అనుభావాలను, బ్రహ్మర్షి పత్రీజీ తో తమకు గల అనుభవాలను తెలియజేసారు.
రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం లోని కైలాసపురి మహేశ్వర మహా పిరమిడ్ లో జరుగుతున్న పత్రీజీ ధ్యానమహా యాగంలో సాంస్కృతిక కార్యక్రమాలు ధ్యానులకు అధ్బుతమైన వినోదాన్ని అందిస్తున్నాయి.యాగంలో 3 వరోజు డిసెంబర్ 23న నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలో ఫైమా PYMA ఆంధ్రప్రదేశ్ కు చెందిన కూచిపూడి కళాకారిని ట్వింకిల్ సాయి హాసినీ కూచిపూడి నృత్యాన్ని అధ్బుతంగా చేసి అలరించింది. అలాగే ఈశ్వరన్ బృందం ప్రదర్శించిన ఆట పాటలు, జిమ్మాస్టిక్ ప్రదర్శన అందరినీ ఆకట్టుకున్నాయి.
రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం లోని కైలాసపురి మహేశ్వర మహా పిరమిడ్ లో పత్రీజీ ధ్యాన మహా యాగం కార్యక్రమం ఎంతో అధ్బుతంగా, విజ్ఞానదాయకంగా సాగుతోంది. పత్రీజీ ధ్యాన మహా యాగంలో మూడో రోజు డిసెంబర్ 23న నిర్వహించిన ప్యానెల్ డిస్కషన్ లో పాత్ టు సక్స్ స్ అనే అంశంపై చర్చ జరిగింది. ఇందులో సోల్ కోచ్ ట్రైనర్ ( sole coach trainer) హరిక, స్పీకర్ హారీష్, ఆచార్య పవన్ కుమారులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా యువత ఎదుర్కోంటున్న సమస్యలు, అలాగే పెళ్లి, రిలేషన్ షిప్ లపై యువత లో నెలకొన్న సందేహాలను నివృత్తి చేసారు..