తిరుచానూరు బ్రహ్మోత్సవాల్లో ఐదవరోజు ...

 

తిరుచానూరు బ్రహ్మోత్సవాల్లో ఐదవరోజు ...

 

 

 

తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శ్రీ పద్మావతీ అమ్మవారి వాహన సేవలు నయనానందకరంగా సాగుతున్నాయి. అలమేలుమంగ రోజుకు రెండు వాహనాలపై వివిధ దేవతామూర్తుల రూపాల్లో భక్తజనులకు దర్శనం ఇస్తున్నారు. ఉదయం 4 గంటలకు అమ్మ వారిని సుప్రభాతంతో మేల్కొల్పి నిత్యకైంకర్యాలను నిర్వహించారు. 7 గంటలకు అమ్మవారిని సన్నిధి నుంచి వాహనమండపానికి తీసుకువచ్చి కొలువుదీర్చారు. అమ్మవారు మోహినీ అవతారంలో భక్తులకు కనువిందు చేయనున్నారు.

 

 

 

అమ్మవారికి పల్లకి ఉత్సవం నిర్వహించి అమ్మవారిని నాలుగు మాడల వీథులలో ఊరేగిస్తారు. మధ్యాహ్నం అమ్మవారికి గంధంతో అభిషేకం చేయిస్తారు. ఉదయం పల్లకి వాహనం, సాయంత్రం 4 గంటలకు వసంతోత్సవం, రాత్రి 8గంటలకు గజవాహనంపై మాడవీథుల్లో అమ్మవారు విహరిస్తారు.