తిరుచానూరు బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదవరోజు

 

 తిరుచానూరు బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదవరోజు

 

 

 

ఉదయం 4 గంటలకు 4.30 గంటల మధ్య అమ్మ వారిని సుప్రభాతంతో మేల్కొల్పి నిత్యకైంకర్యాలను నిర్వహించారు. 7 గంటలకు అమ్మవారిని సన్నిధి నుంచి వాహనమండపానికి తీసుకువచ్చి కొలువుదీర్చారు. అనంతరం పట్టు పీతాంబరాలు, రత్నఖచిత మణిమాణిక్యాలతో అలంకరించి పుష్ప రథోత్సవంపై నిలిపారు.  వృశ్చిక లగ్నంలో అమ్మవారిని రథోత్సవంపై కొలువుదీర్చి భక్తులు అమ్మవారి రథాన్ని తాళ్ళతో ముందుకు కదిలించారు.  ఉదయం 7-15 గంటలకు చిన్నారుల కోలాటాలు, సంప్రదాయ నృత్యకళాకారుల ప్రదర్శనలు, జియ్యర్ల ప్రవచనాలు, వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య అమ్మవారు తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. 

 

 

 


అమ్మవారరికి రాత్రి 8 నుంచి 10 గంటల వరకు హనుమంత వాహన సేవ జరుగుతుంది. అమ్మవారు అశ్వవాహనంపై తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు