ప్రవాళ హనుమంతుని పూజతో ప్రశాంతత (Pravala Hanuman Pooja)
ప్రవాళ హనుమంతుని పూజతో ప్రశాంతత
(Pravala Hanuman Pooja)
ప్రవాళం అంటే పగడం. పగడంతో తయారు చేసిన హనుమంతుని ప్రతిమ ఎంతో శ్రేష్ఠమైంది. పూజామందిరంలో ప్రవాళ హనుమంతుని ప్రతిమను ప్రతిష్ఠించుకోగలిగితే అదెంతో మేలు చేస్తుంది. పగడపు ఆంజనేయుని ప్రతిమ అత్యంత శక్తివంతమైందని, దీన్ని పూజిస్తే కోరిన కోరికలు తీరుతాయని పూరాణాలు చెప్తున్నాయి.
ఆంజనేయుని బలం అనంతం. శక్తికి, ధైర్యానికి మారుపేరు హనుమంతుడు. ఆపద సమయంలో ఆంజనేయుని స్మరిస్తే చింతలూ, సమస్యలూ సమసిపోతాయి. ఆంజనేయుని నమ్ముకుంటే మనసు నిబ్బరంగా ఉంటుంది. దెయ్యాలు, భూతాలు లాంటి భయాలు, భ్రమలకు లోనైనప్పుడు హనుమంతుని నామం తలచుకుంటే సత్వర ఫలితం ఉంటుంది. పడుకునేటప్పుడు దిండు కింద హనుమాన్ చాలీసా ఉంచుకుంటే పీడకలలు రావు.
ఇంట్లో ప్రవాళ హనుమంతుని ప్రతిమ గనుక ఉంటే, ఆ పూజామందిరం దేవాలయంతో సమానం. ప్రవాళ ఆంజనేయుడు పిలిస్తే పలుకుతాడు. భక్తుల మొర ఆలకిస్తాడు. కష్టాల నుండి గట్టెక్కిస్తాడు. ఎల్లవేళలా రక్షణగా ఉంటాడు.
ప్రవాళ హనుమంతుని పూజకు ఆర్భాటాలు ఏమీ అక్కరలేదు. నిండైన మనసుతో
"ఓం ఆంజనేయాయ నమః
ఓం మహావీరాయ నమః
ఓం హనుమతే నమః
ఓం మారుతాత్మజాయ నమః
ఓం సర్వగ్రహ వినాసినే నమః
ఓం భీమసేన సహాయకృతే నమః
ఓం సర్వ దుఃఖ హరాయ నమః
ఓం సర్వబంధ విమోచ్యే నమః.."
అని పఠిస్తూ ప్రవాళ హనుమంతుని పూజిస్తే చాలు, ప్రశాంతత సమకూరుతుంది. సమస్యలు తీరి సుఖసంతోషాలు అనుభూతిలోకి వస్తాయి. కొందరు ప్రవాళ హనుమంతుని లాకెట్టును గొలుసులో ధరిస్తారు.
Anjaneya, Hanuman, Pravaala Hanuman, coral hanuman, pravala anjaneya, pravala hanuman chain