Divine Candle
యోగశక్తితో వెలిగించిన దివ్య జ్యోతి
Divine Candle
శబరిమలైలో మకర సంక్రాంతి రోజున కనిపించే మకర జ్యోతిని దర్శించుకునేందుకు లక్షలాదిమంది ప్రజలు భక్తిగా వెళ్తారని మనకు తెలుసు. ఇప్పుడు ఇక్కడ ప్రస్తావిస్తున్నది మకర జ్యోతి గురించి కాదు. మరో దివ్య జ్యోతి. కొన్నేళ్ళ క్రితం జరిగిన ఈ విడ్డూరం చూడండి.
రాయపూర్ ప్రాంతానికి చెందిన బల్జీత్ సింగ్ జబ్బల్ ఒక అద్భుతం చేశారు. ఆవేళ సెప్టెంబర్ ఐదవ తేదీ. టీచర్లను సన్మానించేందుకు సభ ఏర్పాటు చేశారు. మామూలుగా సభల్లో జ్యోతి ప్రజ్వలన గురించి మనకు తెలిసిందే. బిలబిలమంటూ వేదిక మీదున్న పదిమందీ తలా ఓ వత్తీ అంటించబోతారు. జ్యోతి సంగతేమోగానీ వాళ్ళే కనిపిస్తారు. కానీ ఈ సభలో వెలిగిన జ్యోతి అలాంటిది కాదు. అక్కడో మట్టి ప్రమిద ఉంది. అందులో పత్తితో చేసిన రెండు వత్తులున్నాయి. కానీ ప్రమిదలో నూనె కానీ, నెయ్యి కానీ లేదు. బల్జీత్ సింగ్ జబ్బల్ వత్తులకేసి దీక్షగా చూశాడు. అంతే.. గమ్మత్తుగా అవి వెలిగాయి.
సభలో ఉన్నవాళ్ళంతా ఆశ్చర్యంతో కళ్ళు తేలేశారు. “ఎవరీ మహానుభావుడు? సాధు పురుషుడా లేక మంత్రతంత్రాలు తెలిసినవాడా?” అనుకున్నారు. అసలు సంగతి ఏమంటే, మన కళ్ళలో దివ్యమైన శక్తి ఉంటుంది, దానికి కనుక యోగాశక్తిని జతచేస్తే అద్భుతాలను సృష్టించవచ్చు- అని చెప్తారు సాధువులు. జబ్బల్ చేసింది అదే. తన అసాధారణ యోగశక్తితో నూనె లేని వత్తులను ప్రజ్వలింప చేశాడు. ఆ జ్యోతిని సభలో అందరూ చూశారు. చివరికి పత్తి కాలిన వాసన కూడా వచ్చింది. అది భ్రమ కాదు, మాయ కాదు. గారడీయో, మాజిక్కో అసలే కాదు. మరేంటి? దీని వెనుక ఉన్న మర్మం ఏమిటో తెలుసుకుందాం.
మన శరీరంలో అంతర్వాహినిలా విద్యుత్తు ప్రవహిస్తుంటుంది. ఆ అగ్ని లేదా విద్యుత్తు కళ్ళలో మరి కొంత తీవ్రంగా ఉంటుంది. రాత్రంతా నిద్రపోతాం కనుక ఆ విద్యుత్తు కేంద్రీకృతమై ఉదయం లేచిన వెంటనే తీవ్రంగా కళ్ళనుండి ప్రసరిస్తుంది. అందుకే పొద్దున్న లేవగానే ఎవర్నీ చూడొద్దంటారు. ఎవరి ముఖం చూస్తే వారిపై ఆ విద్యుత్తు ప్రవహిస్తుంది. అందుకే ఏదైనా చెడు జరిగినా, మనసుకు విచారంగా ఉన్నా “ఇవాళ పొద్దున్నే లేచి ఎవరి ముఖం చూశానో” అంటారు. ఇలాంటి అనర్ధాలు జరక్కుండా ఉదయం లేవగానే ఎవరి చేతుల్ని వాళ్ళు చూసుకోవాలని చెప్పారు పెద్దలు. అప్పుడు కళ్ళలో నిగూఢంగా ఉన్న విద్యుత్తు చేతుల్లోకి పాకుతుంది. అందువల్ల ఉత్సాహం కలగడమే తప్ప హాని జరగదు.
ఇది కేవలం గుడ్డి నమ్మకం కాదు. యోగశక్తి సాధించినవారు కంటి చూపు ద్వారా ఏమైనా అద్భుతాలు చేయగలరు. ఇందులో మంత్రాల ప్రసక్తి లేదు. అపురూపమైన యోగశక్తి మాత్రమే. పూర్వం మహర్షులు ఈ యోగశక్తితోనే దూరశ్రవణం, దూరదర్శనం లాంటివి సాధించగలిగారు. అలాగే, సంకల్ప బలాన్ని మించింది ఇంకొకటి లేదు. ఫలానా పని జరగాలని గాఢంగా సంకల్పించినప్పుడు ఆ పని పూర్తయి తీరుతుంది. బల్జీత్ సింగ్ జబ్బల్ చేసిన పని అదే. కళ్ళలో కేంద్రీకృతమైన విద్యుత్తు సాయంతో జ్యోతి ప్రజ్వలన చేయాలని సంకల్పించుకున్నాడు. అతని యోగశక్తికి సంకల్పబలం తోడయింది. ఫలితమే దివ్య జ్యోతి.
బాగుంది కదూ.. మీరూ ప్రయత్నించి చూడండి.
Mysteries and Miracles divine candle, indian yogic power, candle with yogic power, indian mysteries and miracles, indian unbelievable facts, hindu traditions and yogic knowledge