Divine Mopidevi Putta
సంతానాన్ని ఇచ్చే మోపిదేవి పుట్ట
(Divine Mopidevi Putta)
మోపిదేవి దగ్గర్లో ఉన్న మాలపల్లిలో ఓ పాముపుట్ట ఉంది. ఇందులో ఉన్న నాగుపాము దివ్యమైంది అని ప్రజల ప్రగాఢ నమ్మకం. ఈ పుట్టలో పాలు పోయడానికి ఎక్కడెక్కడి నుంచో భక్తులు వస్తారు. ముఖ్యంగా పిల్లలు పుట్టనివాళ్ళు ఈ మోపిదేవి సమీపంలో ఉన్న మాలపల్లి పుట్టకు మొక్కుకుంటారు. అలా మొక్కుకున్నవారికి ఏడాదిలో పిల్లలు పుట్టిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి.
సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయం ఉన్న మోపిదేవిని పవిత్రమైన ప్రదేశంగా భావిస్తారు. ఈ ఊరికి సంబంధించి స్థల పురాణాలు వ్యాప్తిలో ఉన్నాయి. అందుకు నిదర్శనంగా ఈ గుడిని దర్శించుకున్న వారి కోరికలు నెరవేరుతాయి. సంతానం లేదని బాధపడుతూ ఇక్కడి మాలపల్లి పుట్టకు మొక్కుకున్న ఎన్నో జంటలు ఏడాది తిరక్కుండా బిడ్డకు జన్మనిచ్చిన ఉదాహరణలు ఉన్నాయి.
నాగులచవితి, సుబ్రహ్మణ్య షష్టి, నాగపంచమి లాంటి విశేష దినాల్లో మోపిదేవి పరిసర ప్రాంతాల్లో నాగుపాములు సంచరిస్తుంటాయి. అవి ఎవరికీ ఎలాంటి హాని చేయవు. ఇలా కనిపించే నాగుపాములు విశేష దైవిక శక్తి గలవని స్పష్టం అయ్యేలా అద్బుత సువాసనలు వెదజల్లుతాయి.
సంతానం లేనివారు మాత్రమే కాదు, సమయానికి పెళ్ళి కానివారు, చెవిలో చీము కారుతున్నవారు, పీడకలలతో భయపడుతున్నవారు - ఇలా ఎందరో నాగదోషం ఉన్నవారు మోపిదేవి పుట్టకు మొక్కుకుని, దోష నివారణ చేసుకుని సంతోషంగా తిరిగి వెళ్తుంటారు.
mopidevi putta and children, mopidevi subrahmanya swamy, divine putta in mopidevi, untold mysteries, indian mysteries and miracles, adventures, nammaleni nijaalu, vintalu-viddooraalu