Read more!

శ్రీ వేంకటేశ మహిషీ మహాలక్ష్మీ చతుర్వింశతి నామస్తోత్రము

 

శ్రీ వేంకటేశ మహిషీ మహాలక్ష్మీ చతుర్వింశతి నామస్తోత్రము

అత్యద్భుతమైన శక్తిగల ఈ నామావళిని ఆర్థిక బాధల నివారణకు అనునిత్యం, ఉదయం, సాయంత్రం ఆవునేతితో రెండు దీపాలు ఒకే కుందెలో వెలిగించి - ఈ క్రింది సోత్రాన్ని చదివి ఏడు మారేడు దళములు అలివేలు మంగమ్మ శ్రీనివాసుల చిత్రపటం మీద అలంకరించి కర్పూర హారతి అచంచల నిష్ఠతో ఇస్తే త్వరలోనే గొప్ప ఫలితం లభిస్తుంది.

స్తోత్రమ్
నమశ్రియై లోకధాత్ర్వై బ్రహ్మామాత్రే నమోనమః
నమస్తే పద్మనేత్రాయై పద్మముఖ్యై నమోనమః !!

ప్రసన్న ముఖ పద్మాయై పద్మ కాంత్యై నమోనమః
నమో బిల్వ వన స్థాయై విష్ణు పత్న్యై నమోనమః

విచిత్ర క్షామ ధారిణ్యై పృథు శ్రోణ్యై నమోనమః
పక్వ బిల్వ ఫలాపీన తుంగస్తన్యై నమోనమః !!

సురక్త పద్మ పత్రాభ కరపాదతలే శుభే
సరత్నాంగదకేయూర కాంచీనూ పురశోభితే !!

యక్షకర్ధమ సంలిప్త సర్వాంగే కటకోజ్జ్వలే
మాంగళ్యా భరణైశ్చిత్రైః ముక్తాహారై ర్విభూషితే !!

తాటంకై రవతం సైశ్చ శోభమాన ముఖాంబుజే
పద్మ హస్తే నమస్తుభ్యం ప్రసీద హరివల్లభే !!

ఋగ్యజుస్సామరూపాయై విద్యాయైతే నమోనమః
ప్రసీదాస్మాన్ కృపాదృష్టి పాతై రాలోక యాబ్దిజే
యేదృష్టాతే త్వయా బ్రహ్మరుద్రేంద్రత్వం సమాప్నుయుః

ఫలశ్రుతి
ఇతిస్తుతాతథాదేవైః విష్ణు వక్షస్స్థలాలయా
విష్ణునా సహసందృశ్య రమాప్రేతావదత్సురాన్
సురారీన్ సహసాహత్వా స్వపధాని గమిష్యథ
యే స్థానహీనాః స్వస్థానా ద్ర్భ్రం శితాయేనరాభువి
తేమామనే నస్తోత్రేణ స్తుత్వా స్థానమవాప్నుయుః !!