Read more!

నల్గొండ జిల్లాలో పెరుగుతున్న శివలింగం Lord Shiva Linga increase gradually in Nalgonda district

 

నల్గొండ జిల్లాలో పెరుగుతున్న శివలింగం

Lord Shiva Linga increase gradually in Nalgonda district

 

నల్గొండ జిల్లా మేళ్ళచెరువులో శివలింగం క్రమంగా పెరుగుతోంది. ఇది అతిశయోక్తి కాదు. అక్షరాలా జరిగిన, ఎందరో స్వయంగా చూసిన సంగతి. యాగంటిలో నంది, కాణీపాకంలో వినాయకుడు పెరిగినట్లు ఇప్పుడు నల్గొండ జిల్లా మేళ్ళచెరువులో శివలింగం పరిమాణం పెరిగి భక్తులను ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది.

 

కార్తీకమాస ప్రత్యేక పూజలు జరుగుతున్న నేపథ్యంలో నల్గొండ జిల్లా మేళ్ళచెరువులో శివలింగం పెరుగుతున్న విషయం భక్తులను పరమానందానికి గురిచేసింది. ఇది గొప్ప శుభసూచకం అని భావిస్తున్నారు.

 

నల్గొండ జిల్లాలో మేళ్ళచెరువు పేరెన్నిక గన్న శైవక్షేత్రం. ఇక్కడి మహాశివుడు స్వయంభువుగా వెలశాడు. యాదవరాజులు నిర్మించిన ఈ ఆలయంలోని శివలింగం మహా విశిష్టమైంది. లింగంలోంచి గంగ ఊరుతుంటుంది. శివలింగానికి ఉన్న రంద్రంలోంచి ఎంత నీటిని తీసినా ఇంకా వస్తూనే ఉంటుంది. లింగాన్ని అభిషేకం చేస్తూ ఉంటుంది. భక్తులు ఈ అద్భుత దృశ్యాన్ని చూసి తరిస్తుంటారు. ఇక ఇప్పుడు శివలింగం ఆకృతి పెరుగుతున్నట్లు గ్రహించేసరికి భక్తులు మహోద్వేగానికి గురవుతున్నారు.

 

నల్గొండ జిల్లా మేళ్ళచెరువులో శివలింగం మొదట్లో ఇంత పరిమాణం ఉండేది కాదని, క్రమక్రమంగా పెరుగుతూ ప్రస్తుత సైజుకు వచ్చిందని స్థానికులు, ఆలయ పూజారులు చెప్తున్నారు. శివలింగం ఆకృతి ఎంత పెరిగింది, ఎన్నేళ్ళకు పెరుగుతుంది - అనే అంశాలు ఒక్కొక్కరూ ఒక్కోలా చెప్తున్నప్పటికీ, పెరుగుతున్నది అనేది మాత్రం నిర్వివాదాంశంగా తేలింది. ఇప్పుడు ఈ శివలింగాన్ని అందరూ గమనించారు కనుక, ఈ లెక్కలను బట్టి ఇకపై పోల్చి చూస్తే సరిగ్గా ఎంత పెరిగింది, ఎన్నాళ్ళకు ఎన్ని అంగుళాలు పెరుగుతుంది అనే అంశాలు తేటతెల్లమౌతాయి.


Lord Shiva Linga increase gradually in Mellacheruvu, Shiva Linga Increasing, Nalgonda district Shiva linga's size, famous Shivalay in Mellacheruvu in Nalgonda