ఇంట్లో వేణువు పెట్టుకోవడం శుభమా.. అశుభమా!

 

ఇంట్లో వేణువు పెట్టుకోవడం శుభమా.. అశుభమా!


శ్రీకృష్ణుడి చేతిలో ఉండే వస్తువు వేణువు.  ఈ వేణువునే మురళి,  పిల్లనగ్రోవి అని చాలా పేర్లతో పిలుస్తారు.  శ్రీకృష్ణుడి చేతిలో ఉండే ఈ వేణువును ఒక సంగీత వస్తువు కంటే శ్రీకృష్ణుడితో విడదీయలేని అనుబంధంగా పేర్కొనవచ్చు.  చాలామంది ఇళ్లలో కృష్ణుడి విగ్రహం పెట్టుకుంటూ ఉంటారు.  మరికొందరు నెమలి ఈకలు పెట్టుకుంటారు. ఇంకొందరు గోమాత విగ్రహాలు పెట్టుకుంటారు.  అయితే ఇంట్లో వేణువును పెట్టుకునే వారు కూడా ఉంటారు.  శ్రీకృష్ణుడి చేతిలో ఎప్పుడూ ఉండే వేణువు గురించి చాలామందికి కొన్ని అపోహలు ఉంటాయి.  వేణువును ఇంట్లో పెట్టుకోవచ్చా? ఇంట్లో పెట్టుకోవడం శుభమా? అశుభమా? వీటి గురించి తెలుసుకుంటే.. వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది తెలుసుకుంటే..

వాస్తుశాస్త్రంలో వేణువు చాలా పవిత్రమైన వస్తువు. వేణువును ఇంట్లో ఉంచుకుంటే అది ఇంటికి ఆనందాన్ని,  శ్రేయస్సును తెస్తుందట.  అలాగే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని నిలిపి ఉంచుతుందట.

అయితే వాస్తు ప్రకారం వేణువు ఇంట్లో  ఉంచుకోవడం మంచిదే అయినా దాన్ని ఉంచే దిశ,  స్థానం చాలా ముఖ్యం.  సరైన దిశ, స్థానంలో ఉంచితే అది వాస్తుదోషాలను కూడా తొలగిస్తుందట.

ఇంట్లో లేదా దేవుడి గదిలో ఒక జత వేణువులను గోడకు వేలాడదీయాలి. ఇలా చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి.  ఇంట్లో వాతావరణం తేలికగా మారుతుందట.

కొత్త పనులు ప్రారంభించాలని అనుకునే ముందు,  పనులలో అడ్డంకులు ఎదురవుతుంటే గోడకు నెమలి ఈక ఉన్న వేణువును వేలాడదీయాలట.  ఇలా చేస్తే పనులలో అడ్డంకులు తొలగుతాయి,  పనులు పూర్తవుతాయట.

పిల్లల గదిలో వేణువు ఉంచాలని అనుకుంటే తెలుపు రంగు ఉన్న వేణువను ఉంచడం మంచిదట.  ఇది పిల్లలలో ఏకాగ్రతను పెంచుతుందని అంటారు.

భార్యాభర్తల గదిలో ఆకుపచ్చ రంగు ఉన్న వేణువును ఉంచితే భార్యాభర్తల మద్య ప్రేమ పెరుగుతుందట.  అలాగే ఒకరి పట్ల ఒకరికి గౌరవం కూడా పెరుగుతుందట.

కాబట్టి వేణువు ఇంట్లో ఉంచాలి అనుకుంటే పైన చెప్పుకున్న విషయాలు దృష్ణిలో ఉంచుకుంటే మంచిది.

                                        *రూపశ్రీ.