ఎండిపోయిన తులసిని పడేస్తున్నారా...తులసి చెక్కను ఇలా వాడండి..!

 

ఎండిపోయిన తులసిని పడేస్తున్నారా...తులసి చెక్కను ఇలా వాడండి..!

 


తులసి భారతీయులకు పెద్ద వరం.  హిందూ ధర్మం తులసిని దైవంగా పూజిస్తుంది. ఆయుర్వేదం తులసిని గొప్ప ఔషదంగా పేర్కొంటుంది.  ప్రతి హిందూ కుటుంబం తులసిని తమ ఇంటి ముంగిట్లో పెట్టుకుని పూజ చేసుకోవడం ఆనవాయితీ. అయితే తులసి మొక్క కూడా కొన్నిరోజులే  కళకళలాడుతుంది.  కొన్నాళ్ల తరువాత వాడిపోయి ఎండిపోతుంది.  అందుకే చాలామంది ఆరు నెలలు లేదా ఏడాదికి ఒకసారి మొక్కను మారుస్తూ ఉంటారు. అయితే తులసి మొక్క ఎండినప్పుడు దానిని చాలా మంది పడేస్తారు.  తులసి ఔషద గుణాల గురించి అవగాహన ఉన్నవారు తులసి ఆకులను నిల్వచేసుకుంటారు. కానీ తులసి చెక్కను,  తులసి చిన్న చిన్న కొమ్మలను పడెస్తుంటారు.  కానీ అలా పడేయకుండా తులసి చెక్కను కింది విధంగా ఉపయోగిస్తే ఇంట్లో అన్ని విధాల అభివృద్ది ఉంటుందట.


తులసిలో లక్ష్మీదేవి నివాసం ఉంటుందని అందరికీ తెలిందే. అయితే తులసినే కాదు.. ఎండిన తులసి  కూడా పవిత్రమే. సాధారణంగా ఎండిన తులసి చెక్కతో తులసి మాలలు తయారు చేస్తుంటారు. కానీ ఇంట్లో ఎండిపోయిన తులసి చెక్కను పడేయకూడదు. తులసి చెక్కను ఇంట్లో ఉంచితే సానుకూల శక్తి పెరుగుతుందట. అలాగే వాస్తు ప్రకారం ఎండిన తులసి చెక్కను  ఇంట్లో ఉంచితే ధన ఆకర్షణ పెరుగుతుందట. వ్యాపారాలలో లాబాలు కూడా తెచ్చి పెడుతుందట.

ఎండిన తులసి చెక్కను ఎర్రటి వస్త్రంలో చుట్టి భద్రంగా ఉంచాలి. దీని వల్ల  ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. అప్పుల సమస్యతో బాధపడేవారికి ఆ సమస్య నుండి ఉపశమనం కూడా లభిస్తుంది. ఎండిన తులసి చెక్కను భద్రపరచడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కూడా పెరుగుతుందని అంటున్నారు పురాణశాస్త్ర పండితులు.

                                                *రూపశ్రీ.