స్పటిక మాల ధరించే ముందు ఈ నియమాలు తెలుసుకోండి!

 

స్పటిక మాల ధరించే ముందు ఈ నియమాలు తెలుసుకోండి..!


జ్యోతిష్య శాస్త్రంలో నవరత్నాలు,  పూసలకు కూడా చాలా శక్తి ఉంటుంది.  ఇవి మనిషి గ్రహ స్థితిని ప్రభావితం చేసి వారి జాతకంలో దోషాలను సరి చేయడంలో సహాయపడతాయి. అయితే నవరత్నాల విషయంలో జ్యోతిష్యులు,  పెద్దలు చెప్పిన నియమాలు లాగానే స్పటిక మాల ధరించడంలో కూడా నియమాలు ఉన్నాయి.  స్పటిక మాల ధరించాలంటే ఉన్న నియమాలు ఏంటి? స్పటిక మాలను ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? తెలుసుకుంటే..

శుద్ది..

స్పటిక మాల దరించడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. కానీ నియమాల ప్రకారం దీన్ని శుద్ది చేసిన తర్వాత దరిస్తేనే దీని ప్రయోజనాలు చేకూరుతాయి. శుద్ది చేయకుండా ధరిస్తే ఎలాంటి ప్రయోజనం లభించదు.

ప్రయోజనాలు..

నియమాలను పాటిస్తూ  స్పటిక జపమాల ధరిస్తే అది మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది.  ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది.లక్ష్మీ దేవి ఆశీస్సులతో ధరించిన వ్యక్తి ఆర్థిక శ్రేయస్సును కూడా పొందుతాడు. జ్యోతిష నమ్మకాల  ప్రకారం, స్పటికాన్ని ధరించడం వల్ల శుక్ర గ్రహం బలపడుతుంది. ఇది సంపద, కీర్తి,  ఆకర్షణను పెంచుతుంది. ఇది ఆధ్యాత్మిక పురోగతికి కూడా సహాయపడుతుంది.

ఇలా శుద్ది చేయాలి..

ముందుగా స్పటికాన్ని పంచామృతంతో అంటే గంగా జలం, పచ్చి పాలు, పెరుగు, తేనె,  నెయ్యి మిశ్రమంతో అభిషేకం  చేయాలి.

తర్వాత మళ్లీ   గంగా జలంతో శుభ్రం చేసి, ధూపం,  దీపం సమర్పించాలి. తర్వాత  లక్ష్మీ దేవి ముందు ఉంచాలి.

జపమాల ధరించేటప్పుడు లేదా దానిని ప్రతిష్టించేటప్పుడు, లక్ష్మీ మంత్రం లేదా శుక్ర మంత్రం లను 108 సార్లు జపించాలి.

ఇవి గుర్తుంచుకోవాలి..

స్ఫటికం శుక్ర గ్రహానికి సంబంధించినదిగా పరిగణించబడుతుంది. కాబట్టి శుక్రవారం దానిని ధరించడానికి మంచి రోజుగా పరిగణించబడుతుంది . ఉదయం స్నానం చేసిన తర్వాత సూర్యోదయం సమయంలో దీనిని  ధరించాలి. నిద్రపోయే ముందు జపమాల తీసివేసి, శుభ్రమైన ప్రదేశంలో లేదా  ప్రార్థనా స్థలంలో ఉంచాలి.

ఉదయం స్నానం చేసిన తర్వాత మళ్ళీ ధరించాలి. అపవిత్ర స్థితిలో లేదా సూతక కాలంలో దీనిని ధరించకూడదు. ఒకరు ధరించిన మాలను మరొకరికి ఎప్పుడూ ఇవ్వకూడదు. లేదా వేరొకరి మాలను తీసుకుని  ధరించకూడదు. ఈ నియమాలను విస్మరిస్తే  స్పటిక మాల  ప్రయోజనాలు తగ్గుతాయి.

                         *రూపశ్రీ.