తులసి మొక్క వృద్దమైపోయిందని పారేస్తున్నారా.. ఈ నిజం తెలుసుకోండి..!

 

తులసి మొక్క వృద్దమైపోయిందని పారేస్తున్నారా.. ఈ నిజం తెలుసుకోండి..!


తులసి భారతీయుల హిందూ  ఇళ్లలో ప్రధానంగా కనిపిస్తుంది.  ప్రతి ఇంట్లో పూజలు అందుకుంటుంది. తులసిని లక్ష్మీ స్వరూపంగా భావించి పూజిస్తారు. అయితే  తులసి మొక్కను నాటిన తర్వాత కొన్ని రోజులకు వాడిపోవడం, ఎండిపోవడం జరగుతుంది. నిజానికి ఇలా తులసి మొక్క ఎండిపోయినప్పుడు దానిని ఎండిపోయింది అనకుండా వృద్దమైపోయిందని అనాలని పెద్దలు చెబుతారు.  తులసికి అంత పవిత్రత,  ప్రదాన్యత, గౌరవం ఇస్తారు మన పెద్దలు.  అయితే తులసి మొక్క వృద్దమైపోగానే కొందరు ఆ మొక్కను తీసివేసి పారేస్తుంటారు.  ఆ తర్వాత కొత్త మొక్క నాటుతారు. కానీ వృద్దమైపోయిన తులసి మొక్కను పారేయడం సరికాదని,  వృద్దమైన తులసి మొక్క బంగారం కంటే గొప్పదని అంటున్నారు పండితులు. దీని గురించి వివరంగా తెలుసుకుంటే..

వృద్ద తులసి..

వృద్దమైపోయిన తులసిని పారేయడం కంటే.. చాలా మెరుగ్గా ఉపయోగించవచ్చట.

తులసి మాల..

వృద్దమైపోయిన తులసి కొమ్మలను తీసుకుని వాటిపైన పొరను తొలగించి చిన్న ముక్కలుగా చేసి వాటిని చిన్న పూసల్లాగా చేసుకుని, వాటితో తులసి మాలను తయారు చేసుకుని వాడవచ్చు.  ఈ తులసి మాలను మెడలో ధరించవచ్చు.  తులసి మాలను మెడలో ధరిస్తే శాంతి లభిస్తుంది.   లేక ఇంట్లో మహా విష్ణువు, వెంకటేశ్వరస్వామి, శ్రీకృష్ణుడు.. ఇలా విష్ణుమూర్తి అవతారాలకు అలంకరించడానికి అయినా వాడవచ్చు.  బలంగా ఉన్న తులసి పూసల మాలను జపానికి కూడా ఉపయోగించవచ్చు. ఇది మహావిష్ణువుకు ఎంతో ప్రీతి.

వాస్తు దోషాలు..

వృద్దమైపోయిన తులసిని ఇంట్లో దేవుడి గదిలో ఉంచితే వాస్తు దోషాలు తొలగిపోతాయట.

దరిద్ర నాశనానికి..

  వృద్దమైన తులసిని ఒక ఎర్రని వస్త్రంలో  వేసి చిన్న మూటగా కట్టాలి. ఈ మూటను ఇంటి ప్రదాన ద్వారానికి కట్టాలి. ఇలా చేస్తే ఇంట్లోకి దరిద్రం ప్రవేశించదని చెబుతారు.

హోమం..

వృద్దమైన తులసిని హోమంలో సమిధలుగా వేస్తారు. ఇలా వేయడం వల్ల తొమ్మిది గ్రహాలు శాంతిస్తాయట.

దీపపు వత్తి..

ఇంట్లో దీపం పెట్టేటప్పుడు నేతి దీపం లో తులసి కొమ్మలను చిన్న వత్తులుగా చేసి వాటితో నేతి దీపం వెలిగించాలి. ఇలా వెలిగిస్తే లక్ష దీపాలు వెలిగించిన పుణ్యం వస్తుందట.

కాబట్టి తులసి మొక్క వృద్దమైపోతే దానిని పడేయకుండా పై విధాలుగా ఉపయోగించి ప్రయోజనం పొందవచ్చు.

 

                                  *రూపశ్రీ.