Vastu: Dining Table and Television
వాస్తులో డైనింగ్, డ్రాయింగ్, టీవీ
ఎక్కడుండాలి?
Vastu: Dining Table and Television
వాస్తులో సింహద్వారం, తలుపులు, కిటికీల విషయంలోనే కాదు, ఏయే వస్తువులు ఎక్కడ ఉండాలి, ఉంటే మంచిది అనే అంశాలు కూడా ఖచ్చితంగా పరిగణనలోకి వస్తాయి. కనుక కొన్ని ముఖ్యమైన వస్తువులు ఏ దిశలో ఉండాలో తెలుసుకుందాం.
డైనింగ్ హాల్
డైనింగ్ హాల్ తూర్పు ఆగ్నేయం లేదా దక్షిణ ఆగ్నేయంలో ఉండాలి. భోజనం చేసేటప్పుడు తూర్పు, పశ్చిమ దిక్కులకు ముఖం చేసి కూర్చోవడం మంచిది.
టెలివిజన్
చాలామంది టీవీ హాల్లో ఉంచుతారు. కొందరు గదిలో ఏర్పాటు చేస్తారు. తమ వీలును బట్టి హాల్లో అయినా, రూంలో అయినా ఉంచొచ్చు. ఎక్కడైనా ఆగ్నేయంలో ఉంటే శ్రేష్టం. అలా కుదరని పక్షంలో పశ్చిమం, లేదా దక్షిణ దిశలో టీవీని ఉంచాలి.
ఎటువైపు పడుకోవాలి?
దక్షిణం వైపు తల పెట్టి పడుకోవడం ఉత్తమం.
పశ్చిమానికి తల పెట్టి పడుకోవడం కూడా మంచిదే.
తూర్పువైపు తల పెట్టి పడుకుంటే పరవాలేదు.
ఉత్తరం వేపు తల పెట్టి పడుకోవడం అస్సలు మంచిది కాదు.
రీడింగ్ రూం
ఇల్లు విశాలంగా ఉన్నవారు రీడింగ్ రూం అంటూ ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకుంటారు. అంత సౌకర్యం లేనివారు డ్రాయింగ్ రూం లోనే కూర్చుని చదువుకుంటారు. మరి ఈ చదువుకునే గది ఎటువైపు ఉండాలి అనే అంశంలో చాలామందికి స్పష్టత లేదు. రీడింగ్ రూం తూర్పు, ఉత్తర, ఈశాన్య, వాయువ్య దిశల్లో ఉండటం మంచిది. తూరుపు లేదా దక్షిణ ముఖంగా కూర్చుని చదువుకోవాలి.
సోఫాలు, కుర్చీలు ఎటువైపు ఉండాలి?
సోఫాలు, కుర్చీలు ఏ దిక్కులో అయినా, ఎటువైపు ముఖం చేసి అయినా ఉండొచ్చు. కాకపొతే, ఈశాన్యం మాత్రం ఉండకూడదు. ఈశాన్యంలో కొంత ఖాళీ స్థలం ఉంచేసి, ఎక్కడైనా వేయొచ్చు.
Indian vastu, Indian Architecture, vastu rules and regulations, vastu lopeholes, vastu doshalu and remedies, dining hall direction in indian architecture, television and sofas direction in indian vastu