Varanda in Eesanyam
ఈశాన్యంలో వరండా ఉండొచ్చా?
Varanda in Eesanyam
ఈశాన్యంలో వరండా ఉండటం మంచిదని చాలామంది భ్రమపడుతుంటారు. కానీ వాస్తు సూత్రాలను అనుసరించి ఈశాన్యంలో వరండా ఉండకూడదు. మహర్షులు, వాస్తు శాస్త్రకారులు ఈశాన్యంలో వరండా ఉంటే అనేక ప్రమాదాలు ఎదురౌతాయని హెచ్చరించారు. ఈ వాస్తు సూత్రాన్ని ధిక్కరించి, ఈశాన్యంలో వరండా నిర్మించినవారు సమస్యల బారిన పడిన దాఖాలాలు ఎన్నో ఉన్నాయి.
ఈశాన్యంలో వరండా ఉంటే ఏయే సమస్యలు ఉత్పన్నం అవుతాయో ఇప్పుడు చూద్దాం.
వృత్తి వ్యాపారాల్లో సమస్యలు ఎదురౌతాయి. ఏదోరకంగా ఇరుకున పడుతుంటారు. ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు ఆగిపోతాయి.
పిల్లలకు, పెద్దలకు కూడా ఆరోగ్యం దెబ్బతింటుంది.
మానసిక శాంతి కరువౌతుంది.
ప్రమాదవశాత్తు కాలు చేయి విరగడం లాంటి ఆపదలు వస్తాయి.
అర్ధాంతర చావు లాంటి భయంకర విపత్తులు కూడా చోటుచేసుకునే అవకాశం ఉంది.
ఇతరత్రా ఇళ్ళు అంతా వాస్తు నియమాలతో ఉన్నప్పటికీ, ఈశాన్యంలో వరండా అనే ఒక్క దోషంతో ఆ ఇల్లు సుఖశాంతులను హరిస్తుంది.
eesanya varanda causes troubles, indian vastu varanda direction, indian vastu rules and varanda, vastu rules and remedies