శ్రావణ మాసంలో ఈ వస్తువులు దానం చేస్తే అదృష్టం పెరుగుతుంది..!
హిందూ మతంలో అన్ని నెలలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. మాస, తిథి ప్రకారం దేవతామూర్తులను పూజించడం ద్వారా వారి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. అయితే శ్రావణ మాసం అన్ని మాసాలలోకి చాలా విశిష్టమైనది. శ్రావణమాసం చాతుర్మాసంలో భాగం. శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో ఉంటాడు. ఈ కాలంలో సృష్టి మొత్తం శివుడి చేతిలో ఉంటుంది. అందుకే చాతుర్మాసంలో శివుడిని ఆరాధించడం వల్ల సంపూర్ణ ఫలితాలు పొందుతారు. అలాగే శ్రావణ మాసంలో కొన్ని వస్తువులు దానం చేస్తే మరింత పుణ్యం, అదృష్టం లభిస్తాయి.
శ్రావణ మాసంలో రాగి లేదా వెండితో చేసిన పాము పడగలను దానం చేయడం చాలా శ్రేయస్కరం. వాటిని ఆలయంలో దానం చేయడం చేస్తే జీవితంలో ఉన్న చెడు తొలగిపోతుందట.
అదేవిధంగా శ్రావణ మాసంలో రుద్రాక్షను దానం చేయడం కూడా శుభప్రదం. దీన్ని దానం చేయడం వల్ల గౌరవం, కీర్తి పెరుగుతాయని అంటారు.
శ్రావణ మాసంలో ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేయడానికి, శివుడికి పంచదార,పెరుగు సమర్పించాలి . అలాగే నిరుపేదలకు దానం చేయాలి. ఇలా చేయడం వల్ల సంతోషం, అదృష్టం పెరుగుతాయి.
శ్రావణ మాసంలో సోమవారం నాడు పేదలకు అన్నదానం చేయాలి. ఇది ప్రగతికి బాటలు వేస్తుందని పురాణ పండితులు చెబుతున్నారు.
శ్రావణ మాసంలో వచ్చే శనివారం నల్ల నువ్వులను దానం చేయాలి. ఇలా చేయడం వల్ల శనిగ్రహం వల్ల కలిగే దుష్పరిణామాలు తగ్గుతాయని నమ్మకం.
దేవతల దేవుడైన మహాదేవునికి ఇష్టమైన శ్రావణ మాసంలో పేదవారికి బెల్లం దానం చేయాలి. దీంతో డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయని చెబుతారు.
*రూపశ్రీ.