వరలక్ష్మి పండుగ రోజు ఇంటికి ఈ మూడు తీసుకొస్తే అదృష్టమే అదృష్టం!

 

వరలక్ష్మి పండుగ రోజు ఇంటికి ఈ మూడు తీసుకొస్తే అదృష్టమే అదృష్టం!!


 వరలక్ష్మి దేవిని విష్ణువు భార్యగా పరిగణిస్తారు. సనాతన ధర్మంలో వరలక్ష్మి దేవి ఆరాధన చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఈ సంవత్సరం వరలక్ష్మీ వ్రతాన్ని  25 ఆగస్టు 2023 నాడు జరుపుకోబోతున్నారు.  ఈ రోజు ఇంటికి మూడు వస్తువులను తీసుకుని వస్తె అది సకల సంపదలూ చేకూరుస్తుందని నమ్ముతారు.

సనాతన ధర్మంలో  లక్ష్మిదేవికి ప్రత్యేక స్థానం ఉంది.  లక్ష్మిని సంపదకు దేవతగా పూజిస్తారు.  లక్ష్మిదేవి అనుగ్రహంతో జీవితంలో ఆనందం, శాంతి, సంపద  శ్రేయస్సు కలుగుతాయి. . హిందూమతంలో,శుక్రవారం లక్ష్మీదేవికి ప్రీతికరమైనది. ఇక శ్రావణ మాసంలో శుక్రవారం నాడు వచ్చే వరలక్ష్మి వ్రతం చాలా శక్తివంతమైనది మరియు ప్రత్యేకమైనది.   లక్ష్మీ స్వరూపమైన వరలక్ష్మి దేవిని ఈ శ్రావణ శుక్రవారం రోజు పూజిస్తారు. వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు. వారాలు కురిపించే ఈ చల్లని తల్లి కృప లభిస్తే జీవితం ధన్యం అయినట్టే.  

 వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తే అష్టలక్ష్మి అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు. పద్దతి ప్రకారం ఎలాంటి పొరపాట్లు జరగకుండా   ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల జీవితంలో దారిద్య్రం తొలగిపోయి,  జీవితంలోని అన్ని రకాల బాధలు తొలగిపోయి సుఖ సంతోషాలు కలుగుతాయి.

లక్ష్మీదేవికి ఇష్టమైనవి

వరలక్ష్మి వ్రతం రోజున, లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి ఇంట్లో కొబ్బరికాయను తప్పనిసరిగా తీసుకురావాలి. లక్ష్మీదేవికి ఇష్టమైన వాటిలో కొబ్బరి ఒకటి. దీన్ని ఇంట్లో ఉంచడం వల్ల వరలక్ష్మి ఆశీస్సులు ఇంటిల్లిపాదిపై ఉంటాయి. ఇంకా అమ్మ అనుగ్రహం పొందడానికి వరలక్ష్మి వ్రతం రోజున ఈ మూడు పనులు చేయొచ్చు..

బంగారు నాణేలు..

బంగారు నాణేలు లక్ష్మీ దేవికి ప్రియమైనదిగా పరిగణించబడుతుంది. వరలక్ష్మీ వ్రతం రోజున, లక్ష్మీదేవిని పూజించి, పసుపు రంగు వస్త్రంలో 11 బంగారు నాణేలను కట్టి, ఉత్తరం వైపు ఉంచాలి. ఇలా చేస్తే ఆ ఇంట్లో ఐశ్వర్యం పెంపొందుతుంది. 

 శంఖం తీసుకునిరావాలి..

లక్ష్మీదేవికి దక్షిణవర్తి శంఖం చాలా ప్రీతికరమైనది. శాస్త్రాల ప్రకారం, శంఖంలో లక్ష్మీదేవి నివసిస్తుందని నమ్ముతారు. సముద్ర మథనంలో బయటకు వచ్చిన  14 రత్నాలలో ఇది ఒకటి. వరలక్ష్మీ వ్రతం రోజున దీన్ని ఇంట్లోకి తీసుకురావడం వల్ల డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయని నమ్ముతారు.

పారిజాతం మొక్క..

పారిజాత పుష్పాలు లక్ష్మీదేవికి చాలా ఇష్టం.  అమ్మవారి ఆశీర్వాదం కావాలి అంటే  ఇంట్లో పారిజాతం మొక్కను నాటాలి. 

ఈ మూడు పనులు చేస్తే అమ్మవారి ఆశీర్వాదం ఇంటిపై ఎప్పుడు ఉంటుంది. ఆర్థిక సమస్యలు తొలగిపోయి ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది.

                                         *నిశ్శబ్ద.