పెళ్ళికానివారు శుక్రవారం ఈ పూజ చేస్తే ఏం జరుగుతుంది!
పెళ్ళికానివారు శుక్రవారం ఈ పూజ చేస్తే ఏం జరుగుతుంది!
హిందూ మతంలో, శుక్రవారం లక్ష్మీ దేవిని పూజిస్తారు. ఈ రోజున లక్ష్మీ దేవిని పూజించి.. ఉపవాసం ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందవచ్చు. అయితే, ఈ రోజున మనం కొన్ని ఆచారాలు, నియమాల ప్రకారం లక్ష్మీ దేవిని పూజించాలని గుర్తుంచుకోండి. మీరు కూడా లక్ష్మీ దేవిని ప్రసన్నం చేసుకోవాలనుకుంటే .. ఆమె ఆశీర్వాదం పొందాలనుకుంటే, శుక్రవారం దీనికి అత్యంత పవిత్రమైన రోజు. శుక్రవారం రోజు ఈ పనులు చేస్తే పనిలో ఆటంకాలు తొలగి, వృత్తిలో పురోభివృద్ధి, ధనప్రాప్తి, కోరికలు నెరవేరుతాయి. అయితే శుక్రవారం మీరు ఏం చేయాలో తెలుసుకుందాం.
గోవుకు సేవ చేయడం:
లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి ఆవులకు శుక్రవారాల్లో రొట్టెలు ఆహారంగా ఇవ్వాలి. ఈ రోజున గోవుపూజ చేసిన తర్వాత మీకు చేతనైనంతలో పేదలకు బట్టలు, అన్నదానం చేయాలి. దీనితో పాటు మీరు ఈ రోజున లక్ష్మీ దేవికి పాయలను సమర్పించాలి. శుక్రవారం రోజు ఇలా చేస్తే లక్ష్మీదేవి తప్పకుండా ప్రసన్నం అవుతుంది.
సంపద కోసం ఇలా చేయండి:
ప్రతి వ్యక్తి ఆర్థికంగా ఎన్నో కష్టాలను, సమస్యలను ఎదుర్కొంటాడు. లక్ష్మీదేవికి ఇలా చేయడం వల్ల ఆ కష్టాలను నుంచి బయటపడవచ్చు. మీరు కూడా ఐశ్వర్యాన్ని పొందాలనుకుంటే, శుక్రవారం తెల్లవారుజామున స్నానం చేసి, ఈ మంత్రాన్ని 11 సార్లు తప్పకుండా జపించండి. ఈ మంత్రం కేతు మంత్రం. శుక్రవారం తెల్లవారుజామున జపించడం వల్ల జీవితంలో డబ్బు సంబంధిత సమస్యలు నయమవుతాయి.
కోరికల నెరవేర్పు కోసం:
మీకు ఏదైనా ప్రత్యేక కోరిక ఉంటే, శుక్రవారం సూర్యోదయానికి ముందే లేచి, స్నానం చేసి, శివాలయానికి వెళ్లి శివలింగానికి నీటితో అభిషేకం చేయండి. శివలింగానికి కొబ్బరికాయను సమర్పించి చేతులు జోడించి మీ కోరిక నెరవేరాలని ప్రార్థించండి. శివుడు తప్పకుండా మీ కోరికలన్నీ తీరుస్తాడు.
మంచి జీవిత భాగస్వామిని పొందడానికి:
మీరు మంచి జీవిత భాగస్వామిని పొందాలనుకుంటే లేదా మీ భాగస్వామి నుండి ప్రేమను పొందాలనుకుంటే లేదా వైవాహిక జీవితంలో మాధుర్యాన్ని పొందాలనుకుంటే, మీరు శుక్రవారం రోజున 21 సార్లు కేతువు మంత్రాన్ని జపించాలి. "ఓం స్రం శ్రీం శ్రౌం సః కేతవే నమః"
శుక్రవారం లక్ష్మీపూజ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు:
-శుక్రవారం రోజున లక్ష్మీదేవిని పూజించడం వల్ల ఆరోగ్యం, ఐశ్వర్యం లభిస్తాయి.
-పెళ్ళికానివారు శుక్రవారం లక్ష్మీపూజ చేస్తే మంచి భర్త లభిస్తాడు.
-వివాహితులకు లక్ష్మీ పూజ సంతోషాన్ని పెంచుతుంది.
-ఉపాధి రంగంతోపాటు అన్ని రంగాలలో ఆర్థికాభివృద్ధి ఉంటుంది.
-సంతానం కోసం శుక్రవారాల్లో లక్ష్మీపూజ చేయాలి