Powerful Hanuman Prayer

 

సకల వాంఛితాలనూ తీర్చే హనుమంతుని ప్రార్థన

Powerful Hanuman Prayer

 

శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం

ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం

భజేవాయుపుత్రం భజేవాలగాత్రం

భజేహం పవిత్రం భజేసూర్యమిత్రం

అంటూ హనుమంతుని భక్తిశ్రద్ధలతో పూజిస్తాం.

ఆంజనేయాయ శూరాయ సుగ్రీవ సచివాయచ

జన్మ మృత్యుభయఘ్నాయ సర్వక్లేశ హరాయచ

అంటూ రామభక్త హనుమంతుని కీర్తిస్తాం.

ఓం నమో వాయిపుత్రాయ భీమరూపాయ ధీమతే

నమస్తే రామదూతాయ కామరూపాయ శ్రీమతే

మోహశోక వినాశాయ సీతాశోక వినాశినే

భగ్నాశోక వనాయాస్తు దగ్ధలంకాయ వాగ్మినే

అంటూ హనుమంతుని గానాన్ని మైమరచి పాడుకుంటాం.

వాయుదేవిని పుత్రుడు, శ్రీరాముని బంటు అయిన హనుమంతుని ఎంత కీర్తించినా తక్కువే. ఈ మహాబలుడైన హనుమంతుని ప్రార్ధిస్తే సకల వాంఛితాలూ నెరవేరుతాయి. ఎర్రని కన్నుల వానరుడు మహా పరాక్రమవంతుడు. కనుకనే శతయోజన విస్తారమైన సముద్రాన్ని అవలీలగా దాటి అందర్నీ సంభ్రమాశ్చర్యాలలో ముంచాడు. లంకలో బందీగా ఉన్న సీతమ్మ తల్లిని కలిసి, శ్రీరాముని అంగుళీయకం చూపించి ఆమె శోకాన్ని పోగొట్టాడు. హనుమంతుని తల్లి అంజనాదేవి కనుక ఆంజనేయుడు అయ్యాడు.

సంజీవనీ ఔషధ సమేత పర్వతాన్ని మోసుకొచ్చి యుద్ధమున వివశుడైన లక్ష్మణుని ప్రాణములు నిలిపాడు. దశకంఠుడైన రావణాసురుని గర్వమును అణచాడు. ఇంత శక్తిమంతుడైన హనుమంతుని కింది నామములతో స్మరించుకోవాలి. నిద్ర పోయే ముందు, ప్రయాణానికి ముందు స్మరించినవారికి మృత్యుభయం లేదు. వారికి సర్వత్ర విజయం లభిస్తుంది.

హనుమానంజనాసుతః వాయుపుత్రోమహాబలః

రామేష్ఠః ఫల్గుణసఖః పింగాక్షోః అమిత విక్రమః

లక్ష్మణప్రాణదాతాచ దశగ్రీవస్య దర్పహా ద్వాదశైతాని

నామాని కపీంద్రస్య మహాత్మనః ప్రాతఃకాలే పఠేన్నిత్యం

యాత్రాకాలే విశేషతః తస్యమృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీభవేత్

అలాగే హనుమంతుని స్తుతించే ఈ ప్రార్థనా శ్లోకం చాలా ముఖ్యమైంది..

యత్ర యత్ర రఘునాథ కీర్తనం

తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్

బాష్పవారి పరిపూర్ణలోచనం

మారుతిం నమత రాక్షసాంతకమ్

శ్రీరాముని కీర్తన జరిగే చోట హనుమంతుడు పులకితుడై అంజలి జోడించి ఉంటాడు. రాక్షసాంతకుడైన అటువంటి హనుమంతునకు నమస్కరిస్తున్నాను.

వివిధ సందర్భాలలో హనుమంతుని గురించి వివిధ రకాలుగా వర్ణించారు. ఆయా వర్ణనలు అంజనీపుత్రుని నామాలయ్యాయి. రామాయణ మహామాలా రత్నము, జితేంద్రియుడు, శ్రీరామదూత, జానకీశోక నాశకుడు, జ్ఞానగుణ సాగరుడు, హనుమాన గోసాయి. సంకటహారి, మంగళమూర్తి - ఇలా హనుమంతుని గుణగణాలు, గొప్పతనమూ తెలిపే నామాలెన్నో!

హనుమంతుని స్మరించినంతమాత్రాన సీతారాములు ప్రసన్నులవుతారు. హనుమంతుని పేరు వినబడినచోట భూతప్రేత పిశాచాలు, విపత్కర శక్తు ఉండలేవు. సుందరకాండ పారాయణం చేస్తే సకల కార్యాలూ సిద్ధిస్తాయి. మోక్షం కోసం తప్ప మిగిలిన కోరికల విషయమై శ్రీరాముని నేరుగా ప్రార్ధించకూడదని పెద్దలు చెప్తారు. కనుక ఇష్ట కామ్యార్ధ సిద్ధి కోసం ఆంజనేయుని శరణు వేడాలి. హనుమంతుని ప్రార్ధించినట్లయితే సకల వాంఛితాలూ నెరవేరుతాయి.

 

Hanuman prardhana, rama bhakta hanuman prayer, hanuman namasmarana, hanuman stuti for evil forces, lord hanuman gives everything