Read more!

నీ నామమే అన్నింటికీ మూలం!

 

 

 

నీ నామమే అన్నింటికీ మూలం!

 

 

ముదమున కాటపట్టుభవ మోహమద్వ దిరదాంకుశంబు సం

పదల కొటారు కోరికల పంట పరంబున కాది వైరుల

న్నదల జయించుత్రోవ విపదబ్ధికినావగదా సదాభవ

త్సదమలనామసంస్మరణ దాశరథీ కరుణాపయోనిధీ!

తాత్పర్యం: ఓ దశరథ రామా! నీ నామస్మరణ సంతోషాలకు ఆటపట్టు,

భవబంధాలను అణచివేసే అంకుశము,

సకల సంపదలను అందించే వరం,

మోక్షాన్ని కలిగించే సాధనం,

శత్రువులను జయించే మార్గం,

ఆపదలనే సముద్రాన్ని దాటించే నావ.

 

...Nirjara