సముద్రం మీద కురిసి ఏం ప్రయోజనం
సముద్రం మీద కురిసి ఏం ప్రయోజనం
సిరిగల వాని కెయ్యెడల చేసిన మేలది నిష్పలం బగున్
నెఱి గుఱిగాదు పేదలకు నేర్పున చేసిన సత్పలంబగున్
వఱపున వచ్చి మేఘు డొక వర్షము వాడినచేలమీదటన్
కురిసిన గాక అంబుధుల కుర్వగ నేమి ఫలంబు భాస్కరా!
నిండుగా పొంగిపొరలుతున్న సముద్రం మీద మబ్బులు కురిస్తే ఉపయోగం ఉంటుందా! అదే వర్షాలు పడక బీడుబారిన నేల మీద పడినప్పుడు మాత్రం ఎక్కడ లేనీ ఫలితం ఉంటుంది. అలాగే... సిరిగలవానికి మనం ఎంతటి సాయం చేసినా అది నిష్పలంగా మారిపోతుంది. కానీ పేదలకు చేసిన సాయం మాత్రం సత్ఫలితాలను అందిస్తుంది.
..Nirjara