ఎంత ఉన్నవారైనా

 

 

 

ఎంత ఉన్నవారైనా

 

 

అన్నమైన తక్రమైన తోయంబైన

శాకమైన దనకు జరుగుకొలది

నతిథిజనుల కడ్డమాడక యిదరేని

లేమ! వారు కలిగిలేనివారు

గృహస్థు తన ఇంటికి వచ్చిన అతిథులకు ఉన్నంతలో ఏదో ఒకటి పెట్టాలి. అది అన్నం కావచ్చు, కూరగాయలు కావచ్చు, మజ్జిగ కావచ్చు... ఆఖరికి మంచినీరు కావచ్చు! ఇలా అతిథులను గౌరవించుకోలేనివారు ఎంత ధనవంతులైనా పేదవారితో సమానమే!

 

..Nirjara