ఎంతవరకు ప్రాప్తమో

 

 

 

ఎంతవరకు ప్రాప్తమో

 

 

యద్ధాత్రా నిజఫాలపట్టలిఖితం స్తోకం మహద్వా ధనం

తత్ప్రాప్నోతి మరుస్థలేఽపి నితరాం మేరౌ చ నాతోఽధికమ్‌ ।

తద్ధీరో భవ విత్తవత్సు కృపణాం వృత్తిం వృథా మా కృథాః

కూపే పశ్య పయోనిధావపి ఘటో గృహ్ణాతి తుల్యం జలమ్‌ ॥

ఆ భగవంతుడు మన నుదుటన ఎంత ధనం రాసి ఉంచుంతాడో... అంతటి ధనమూ తప్పక లభిస్తుంది. ఎడారిలో ఉన్నా మనకి రాసి పెట్టి డబ్బు చేతికి వచ్చి తీరుతుంది. కానీ నుదుటన కనుక రాసి లేకపోతే, ధనరాశి ముంగిట నిలబడినా కూడా చేతికి చిల్లిగవ్వ రాదు. ఒక చిన్న కుండని బావిలో ముంచినా, సముద్రంలో ముంచినా దానిలోకి చేరే నీటిలో మార్పు ఉండదు కదా! అలాగే మనకు ఎంతవరకు ప్రాప్తమో అంతే డబ్బుని మనం పొందగలుగుతాము. ఈ విషయాన్ని గ్రహించినవాడు ధనవంతులను చూసి దిగులు చెందడు.

 

 

..Nirjara