కర్మని ఆచరించినా

 

 

 

కర్మని ఆచరించినా

 

 

యదృచ్ఛాలాభసంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః ।

సమః సిద్ధావసిద్దౌ చ కృత్వాపి న నిబధ్యతే ॥

మనిషన్నాక కర్మ చేయక తప్పదు. కానీ దాని ప్రతిఫలం అతన్ని మళ్లీ సంసారచక్రంలోకి లాగకుండా ఉండాలంటే అతను చేసే కర్మకి కొన్ని లక్షణాలు ఉండాలంటోంది భగవద్గీత. తనకి లభించినదానితో తృప్తి చెందుతూ, కష్టసుఖాల వంటి ద్వంద్వాల పట్ల అతీతులుగా చరిస్తూ, జయాపజయాల పట్ల సమబుద్ధిని వహిస్తూ... నిష్కల్మషమైన మనసుతో ఉండేవాడికి ఎటువంటి కర్మఫలితమూ అంటబోదు.

 

..Nirjara