బుద్ద భగవానుడికి జ్ఞానోదయం జరిగిన పరిణామ క్రమం ఇదే!

 

బుద్ద భగవానుడికి జ్ఞానోదయం జరిగిన పరిణామ క్రమం ఇదే!

గౌతమ బుద్దుడు రాజు నుంచి ఒక  మహా యోగిగా రూపాంతరం చెందాడు. చాలామంది ఈయన్ను కలియుగ అవతారమని, విష్టువు  దశావతారాలలో ఈయన కూడా ఒకరని అంటారు. అయితే ఒక రాజుగా ఉన్న గౌతమ బుద్దుడు, బుద్ద భగవానునిగా రూపాంతరం చెందడానకి జ్ఞానోదయం పొందాడు. బుద్దుడు బీహార్ లోని గయాలో ఉన్న బోధి వృక్షం కింద జ్ఞానోదయం పొందాడు. గయాలో మహాబోధి ఆలయం పురాతన మతపరమైన ప్రదేశాలలో ఒకటిగా ప్రఖ్యాతి గాంచింది.  మహాబోధి ఆలయంలో బుద్దభగవానుడు జ్ఞానోదయం పొందిన కారణంగా గయాను జ్ఞాన నగరం అని కూడా అంటారు. బుద్దుడికి  జ్ఞానోదయం జరగిన క్రమం ఇదే..

గయాలోని బోధి వృక్షం కింద బుద్దుడికి జ్ఞానోదయం కావడానికి ఏడు వారాల సమయం పట్టింది. ఈ  ఏడు వారాలలో ఒక్కో వారం ఒక్కో విధమైన మార్పులు జరిగాయి.

బుద్దుడు జ్ఞానోదయం పొందడానికి ముందు గయాలోని బోధి వృక్షం కింద వారం రోజులు గడిపాడు. ఆ వారం రోజులు ఆయన ఆలోచనలు ప్రాపంచిక విషయాల చుట్టూ ఉన్నాయి.

రెండవ వారంలో బుద్దుని ఆలోచనలు ప్రాపంచిక విషయాల నుండి బోధి వృక్షం వైపుకు మళ్లాయి. ఆయన వృక్షాన్ని, వృక్ష శాఖలను చూస్తూ రెండవ వారం అంతా గడిపారు.  

మూడవ వారంలో బుద్దుడు మహాబోధి ఆలయం దగ్గర  ఎక్కడ అడుగు పెడితే అక్కడ కమలాలు వికసించాయి.

నాలుగ వారం బుద్దుడు రతన్ ఘర్ లో గడిపారు.   ఆ సమయంలో బుద్దుడి శరీరం నుండి ఆరు రంగుల కిరణాలు వెలువడ్డాయి.

అయిదవ వారం మహాబోధి ఆలయానికి తూర్పు దిక్కున ఉన్న అజపాల నిగ్రోధ చెట్టు కింద గడిపాడు.

ఆరవ వారం అంతా ఆలయ సముదాయానికి దక్షిణంగా ఉన్న లోటస్ పాండ్ దగ్గర గడిపారు.

బుద్దుని జ్ఞానోదయం జరిగిన ఏడు వారాల్లో చివరి వారం అయిన ఏడవ వారంలో ఆలయానికి ఆగ్నేయంగా ఉన్న రాజాయతన చెట్టు క్రింద గడిపారు.  ఇలా బుద్దుడు ఏడు వారాలలో ఒక్కో వారం ఒక్కో విధమైన అనుభవాన్ని పొందారు.

                                              *నిశ్శబ్ద.