Robots in Hindu Literature

 

ప్రాచీన గ్రంధాల్లో మరమనుషులు

Robots in Hindu Literature

 

రోబోట్ల గురించి తెలీనివారు ఉండరు. ఇవి చాలాచాలా ఖరీదైనవి కనుక కోటీశ్వరులు కూడా కొనుక్కోడానికి సాహసించరు కానీ వాటి గురించిన అవగాహన అయితే అందరికీ ఉంది. ప్రభుత్వ, ప్రయివేటు సంస్థలు, కోట్లకు పడగలెత్తిన ధనవంతులు మాత్రమే మరమనుషులను వినియోగించడం మనకు తెలిసిందే.

గది శుభ్రపరచడం దగ్గరనుంచి వంట చేయడం వరకూ, మాట్లాడ్డం మొదలు యుద్ధాలు చేయడం వరకూ, ఆఖరికి లోతైన గనుల్లో, ఎత్తయిన పర్వతాల మీద కూడా మరమనుషులు ఎంతో ఉపయోగపడుతున్నాయి. మనుషుల కంటే మిన్నగా పనిచేస్తున్నాయి. ఎంతో నేర్పుగా, నైపుణ్యంగా, ప్రణాళికాబద్ధంగాగా, అలసట అనేది లేకుండా అత్యంత వేగంగా పనిచేసే రోబోట్లు ఆధునికకాలంలో అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ మరమనిషి ఇటీవలి కాలంలోనే కనిపెట్టినవి అనుకుంటే మాత్రం పొరపాటు. మన ప్రాచీన గ్రంధాల్లో మరమనుషుల ప్రస్తావన ఉంది. మర యంత్రాలను ఉపయోగించి అనేక పనులు చక్కబెట్టినట్లు చెప్పే కధనాలు అనేకం ఉన్నాయి. ఆ విషయాలు వివరంగా తెలుసుకుందాం.

పదకొండవ శతాబ్దానికి చెందిన సంస్కృత గ్రంధాల్లో గృహ కార్యాలు నిర్వహించే అనేక మరయంత్రాల ప్రస్తావన ఉంది. గృహసేవకుని పేరుతో అనేక యంత్రాలు ఉండేవి. అన్నిటికంటే ముఖ్యమైంది ద్వారపాలక యంత్రం. ఈ మరమనిషి కర్ర, కత్తి, బల్లెం లాంటి ఆయుధాన్ని ధరించిన ద్వారపాలక మరయంత్రం నిరంతరం కాపలాగా ఉండేది. దొంగలు ఎవరైనా లోనికి ప్రవేశించబోయారో.. అంతే.. వారి భరతం పట్టేది ఆ మరమనిషి.

ఇప్పుడు పిల్లలు ఆడుకోడానికి ఉపయోగపడే రోబోట్ల నుండి వృద్ధులకు మందులు గట్రా ఇచ్చి కనిపెట్టి చూసుకునే వివిధ రకాల రోబోట్లు వచ్చాయని సంతోషిస్తున్నాం. నిజానికి పూర్వకాలంలోనే అవసరమైనవి వారికీ వీరికీ అందజేయడం, మొక్కలకు నీళ్ళు పోయడం, పలకరించడం, మర్యాద చేయడం, వివిధ సంగీత పరికరాలను ఉపయోగించి సంగీతం వినిపించడం, దొంగలను అడ్డుకోవడం, అవసరమైతే దాడి చేయడం లేదా చంపడం లాంటి అనేక పనులను ప్రాచీనకాలంలోని మరమనుషులు సక్రమంగా నిర్వర్తించేవి.

ప్రాచీన రోబోట్లను చెక్క, కర్ర, తోలు, వస్త్రం, జంతుచర్మం, సూదులు, తీగలు, గొట్టాలు మొదలైన సామగ్రిని ఉపయోగించి తయారుచేసినట్లు సంస్కృత గ్రంధాల్లో లిఖితమై ఉంది. క్రీస్తుశకం 1010 – 1054 కాలం నాటి ప్రసిద్ధ మహారాజు భోజుడు. ఆయన సహజంగా కవిపండితుడు. భోజుని ''సమరాంగణ సూత్రధార'' అనే గ్రంధం రచించాడు. ఇది ప్రధానంగా వాస్తు శాస్త్రమే అయినప్పటికీ ఇందులో ''యంత్రాల నమూనాలు'' అంటూ కొన్ని యంత్రాల గురించి వర్ణించాడు. భోజుడు వాటిని ''మరమనిషి'' అనకపోయినప్పటికీ వాటికి దివ్యత్వాన్ని కూడా అంటగట్టలేదు. పేరు వేరైనప్పటికీ పనితీరు మాత్రం ఒకటే. యంత్ర నమూనా అంటే మెషీన్ మోడల్.. వెరసి మరమనిషి...

మొత్తానికి అతి ప్రాచీన కాలంలోనే అనేక మరయంత్రాలు వాడకంలో ఉండేవని చారిత్రక ఆధారాలు చెప్తున్నాయి.చెక్కను, వెదురుబద్దను ఉపయోగించి మరమనిషిని రూపొందించి వస్త్రం లేదా జంతుచర్మంతో తొడుగు వేసేవారట. మరమనిషిలోని ప్రతి భాగం కదలగలిగేలా, ఆయా పనులకు ఆయా భాగాలను వినియోగించేలా ఉండేవట. ఎలుకలబోను మాదిరిగా, ఆయా మరయంత్రాలు అవసరమైనప్పుడు వాటంతట అవే కదిలి పనులు చక్కబెట్టేలా నియంత్రణ ఏర్పాటై ఉండేది. మరమనుషులను ఏయే వస్తువులతో రూపొందించేవారో, ఏయే పనులకు వినియోగించేవారో, ఎంత బాగా పనిచేసేవో మొదలైన వివరాలన్నీ ఉన్నాయి గానీ వాటిని ఎలా తయారుచేసేవారో తెలిపే వివరాలు లభ్యం కాలేదు.

 

early robots in india, indian robots in epics, robots oldest, robots attack, robot watchman