పూజలో వాడే పువ్వులను ఏం చేయాలి!

 

 

పూజలో వాడే పువ్వులను ఏం చేయాలి!

 


ప్రతి హిందువుకు పూజ చేయడం చాలా సహజమైన విషయం.  పూజలో దీపం, ధూపం,  నైవేద్యం,  పువ్వులు సమర్పించడం  తప్పక జరుగుతుంది.  నైవైద్యం లేకపోయినా పువ్వులు సమర్పించి దీపం పెట్టి నిత్య పూజ చేసుకుంటూ ఉంటారు. అయితే పూజలో సమర్పించే పుష్పాల గురించి మాత్రం చాలామందికి ఒక సందేహం ఉంటుంది.  పువ్వులను వాడిన తరువాత వాటిని తిరిగి ఉపయోగించుకుంటే బాగుంటుందని కొందరు అనుకుంటారు.  పువ్వులను ఏం చేయాలో తెలియక ఇబ్బంది పడేవారు కూడా కొందరు ఉంటారు.  అసలు దేవుడికి సమర్పించిన తరువాత వాడిపోయిన పువ్వులను ఏం చేయాలి?

పూజ చేసేటప్పులు దేవుడికి పువ్వులు పెట్టడం తప్పనిసరి.  అయితే పూజ కోసం వాడిన పువ్వులను చాలామంది పడేస్తుంటారు.  ఇలా చేయడం మంచిది కాదట. చాలామంది పువ్వలను నదిలో, పారే నీటిలో వేస్తుంటారు.  దీని వెనుక కారణం దేవుడి పూజకు వాడిన పువ్వులను  ఎక్కడంటే అక్కడ వేస్తే వాటిని తొక్కుతామని.  అయితే ఇలా నదిలో, నీటిలో పువ్వులను అస్సలు విసిరేయకూడదట.  దీని వల్ల పర్యావరణం దెబ్బతింటుంది అంటున్నారు.


దేవుడి పూజ కోసం వాడిన పువ్వులను అక్కడ ఇక్కడ విసిరే బదులు వీటితో కంపోస్ట్ తయారు చెయ్యడం సులభం. కంపోస్ట్ అంటే ఇతర వ్యర్థాలతో పువ్వులను కలపడం కాదు.. పువ్వులను ఏదైనా చెట్టు మొదట్లో లేదా మట్టిలో కలపాలి. ఇది మట్టికి పోషణ ఇస్తుంది. ఆ మట్టిలో నాటిన మొక్కలలో పచ్చదనం పెంచుతుంది.

దేవుడి పూజకు వాడిన పువ్వులను ఈ మధ్యన ధూప్ స్టిక్స్,  కోన్స్ తయారు చేయడం కోసం ఉపయోగిస్తూ ఉంటారు.కానీ ఇలాంటి తయారు చేసి ఇంట్లో సువాసన కోసం ఉపయోగించ వచ్చు కానీ వీటిని తిరిగి దేవుడి పూజలో ఉపయోగించకూడదు.

                                                 *రూపశ్రీ.