అవకాశం అంతటితో సరి
అవకాశం అంతటితో సరి!
అజామివ ప్రజాం మోహాద్యో హన్యాత్పృథివీపతిః
తస్యైకా జాయతే తృప్తిర్న ద్వితీయ కథంచన॥
ప్రజలను పాలించడం ఓ వరం, దాన్ని నిలబెట్టుకోవాలంటే ఒళ్లు దగ్గర పెట్టుకోవాలి. పాలిచ్చే మేకను కోసుకు తింటే ఇక ఆ తృప్తి అంతటితో సరి. అలాగే పాలించే అధికారాన్ని అందించే ప్రజలని పీడిస్తే... ఆ అవకాశం అంతటితో సరి!