శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో గోవు ప్రాధాన్యమేమిటో తెలుసా!?

 

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో గోవు ప్రాధాన్యమేమిటో

తెలుసా!?

 

సంస్కృతంలో ‘గో’ శబ్దానికి పుంలింగం ‘ఎద్దు’ అనీ, స్త్రీలింగం ‘ఆవు’ అర్థం. ఎద్దునూ, ఆవునూ కలిపి చెప్పే పదం సంస్కృతంలో ఒకటే- అదే “గో” అనేది. ఆవు పాడికి సంకేతం. ఆవులో సకలదేవతలూ ఉంటారు. తల్లిపాల తర్వాత అంతటి శక్తినీ, మేధాశక్తినీ ఇవ్వగలవి గోక్షీరాలే. అందుకే పంచామృతాలలో నేయీ పెరుగులనే వాడతారు. బతికుండగానూ, వ్యక్తి పోవాలంటే చేయవలసింది గోదానమే.. ఇలా గోవుకు సంబంధించి ఎన్నెన్నో విశేషాలున్నాయి. అందుకే అంతటి పవిత్రమైన గోవు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో మొదటి వరుసలో గోవు నడుస్తుంది.

 

 

 

ఇక శ్రీ వేంకటేశ్వర కథలోకి తొంగిచూస్తే, గోవుపాలను తాగే కదా శ్రీనివాసుడు చాలాకాలం జీవించాడు. పద్మావతీ శ్రీనివాసుల కథలో గోవుపాత్ర ఎక్కువేనని బ్రహ్మోత్సవంలో కదిలే గోవులే చెబుతుంటాయి. అదిగాక గోవు తెల్లగా ఉంటుంది. అది సత్త్వగుణానికి చిహ్నం. అందుకే ఆవు- ఎక్కడోగానీ-సాధువుగానే ఉంటుంది.

 

 

తిరుమల శ్రీవారి స్వామి ఊరేగింపును దర్శిస్తున్న భక్తులారా సత్త్వగుణంతో ఉండండి. మాలాగా సాధువులుగా జీవించండి ఇలా మేముంటున్న కారణంగానే దేవతలు మాలో నివసిస్తున్నారు. ఐదురెట్ల పిల్లల్ని ఒక ఈతలో కంటున్నప్పటికీ మా సంతానానికి మించి ఏ పులిజాతీ, సింహజాతీ ఏ ఖండంలోనూ ఉండడం లేదు. కాబట్టి ధర్మమే జయిస్తుందనే విషయానికి మేమే సాక్ష్యం అని మౌనంగా చెబుతూ శ్రీ వేంకటేశుని ఆలయంలో సూక్తి- "ధర్మో రక్షతి రక్షిత”ను పదే పదే గుర్తుచేస్తుంటాయి.