బటుక భైరవి జయంతి.. ఈ రోజు ప్రాముఖ్యత తెలుసా!
బటుక భైరవి జయంతి.. ఈ రోజు ప్రాముఖ్యత తెలుసా!
సనాతన ధర్మంలోని శాక్త , తంత్ర సంప్రదాయాలలో, నిగూఢమైన , అత్యంత శక్తివంతమైన శక్తుల ఆరాధనకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ శక్తివంతమైన శక్తులలో ఒకటి మా బటుక భైరవుడు. బటుక భైరవుడు అంటే శివుని బాల రూపం. బటుక భైరవుని జయంతిని ప్రతి సంవత్సరం జ్యేష్ఠ మాసంలోని పౌర్ణమి రోజున అత్యంత పవిత్రతతో, భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ సంవత్సరం బటుక భైరవ జయంతిని 2026 జూన్ 29, సోమవారం నాడు జరుపుకోనున్నారు. భయం, అకాల మరణం, క్షుద్ర అడ్డంకులు , ప్రతికూల శక్తుల నుండి రక్షణ కోరుకునే తంత్ర, మంత్ర సాధకులకు గొప్ప వరం అని చెప్పవచ్చు. ఈ సందర్భంగా బటుక భైరవ జయంతి ఎప్పుడు? ఎందుకు? ఏ సమయంలో జరుపుకుంటారు? ఈ రోజు జరుపుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? తెలుసుకుంటే..
బటుక భైరవి జయంతి..
హిందూ క్యాలెండర్ ప్రకారం, జ్యేష్ఠ పౌర్ణమి తిథి 2026, జూన్ 28న సాయంత్రం 4:36 గంటలకు ప్రారంభమై, 2026, జూన్ 29న సాయంత్రం 6:56 గంటలకు ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం, 2026 జూన్ 29, సోమవారం నాడు సూర్యోదయంతో పౌర్ణమి వస్తుంది, అందువల్ల ఈ రోజున బటుక భైరవి జయంతిని జరుపుకుంటారు.
బటుక భైరవి ఎవరు?
మత విశ్వాసాల ప్రకారం విశ్వంలో ప్రతికూల శక్తులు , రాక్షసులు మితిమీరినప్పుడు, ప్రపంచాన్ని రక్షించడానికి శివుడు ఆనంద భైరవ రూపాన్ని ధరించాడు. ఆయన శక్తిగా, ఆదిశక్తి దేవి బటుక భైరవి రూపాన్ని ధరించిందని చెబుతారు.
అమ్మవారి ఈ రూపం సౌమ్యత, ఉగ్రత రెండింటినీ సమతుల్యం చేస్తుంది. ఆమె తన భక్తుల పట్ల ప్రేమ, దయ కలిగి ఉన్నప్పటికీ, దుష్ట , రాక్షస శక్తులను ధిక్కరించే శక్తి గా నిలుస్తుంది. ఈ రోజున ఆమెను పూజించడం వల్ల జాతకంలోని రాహు, కేతు, శని గ్రహాల అశుభ ప్రభావాల నుండి ఉపశమనం లభిస్తుంది.
బటుక భైరవి ఆరాధన..
బటుక భైరవి ఆరాధనలో పవిత్రత, ఆధ్యాత్మికత చాలా ముఖ్యం. ఉదయం నిద్రలేచి స్నానం చేసిన తర్వాత, శుభ్రమైన బట్టలు ధరించి, ఒక బల్లపై ఎర్రటి వస్త్రాన్ని పరచాలి. ఆ తర్వాత, దుర్గాదేవి లేదా భైరవి దేవి విగ్రహాన్ని లేదా చిత్రాన్ని ఉంచాలి. అలాగే, శివుని లేదా బటుక భైరవుని విగ్రహం ఉంటే, దానిని కూడా పక్కన ఉంచాలి.
తర్వాత, అమ్మవారికి కుంకుమ, ఎర్ర చందనం, అక్షింతలు, ఎర్రని పువ్వులను సమర్పించాలి. నైవేద్యంగా మామిడి పండ్లు లేదా తీపి పదార్థాలు నైవేద్యంగా ఉంచాలి.
తర్వాత ఆవు నెయ్యి లేదా ఆవ నూనెతో దీపం వెలిగించాలి. దుర్గాదేవికి నవర్ణ మంత్రం లేదా భైరవి మంత్రం జపించాలి. ఇది మనస్సును ప్రశాంతపరుస్తుంది.
పూజ అనంతరం చివరగా అమ్మవారికి హారతి ఇచ్చి, తెలియకుండా చేసిన ఏవైనా పొరపాట్లకు క్షమాపణ కోరాలి. ఇలా చేసుకుంటే అమ్మవారి అనుగ్రహం కలిగి, మరణ భయం, పిరికితనం, జాతకంలో రాహు,కేతు, శని దోషాలు వంటివి పోయి.. ధైర్యం పెరుగుతుంది. సానుకూల జీవితం ఏర్పడుతుంది.
*రూపశ్రీ