Read more!

అయోధ్య రామయ్య అక్షింతలు ఏం చేయాలి? ఏం చేస్తే ఎలాంటి ఫలితాలుంటాయంటే..!

 


అయోధ్య రామయ్య అక్షింతలు ఏం చేయాలి? ఏం చేస్తే ఎలాంటి ఫలితాలుంటాయంటే..!

కనివినీ ఎరుగని అద్బుత ఘట్టం రామ మందిర నిర్మాణంతో సాధ్యమైంది. త్రేతాయుగం ముగిసిన కోటి 60లక్షల ఏళ్ల తరువాత.. కలియుగం ప్రారంభమైన 6వేల ఏళ్ల తరువాత రామ మందిర నిర్మాణం సాధ్యమైంది. ప్రతిష్ట కూడా అత్యంత వైభోగంగా జరిగింది. ఈ పాటికే దేశంలో గ్రామ గ్రామానికి ఆ శ్రీరామ చంద్రుని పవిత్రమైన అక్షింతలు ఇంటింటికీ చేరుకుని ఉంటాయి. అయితే ఈ  అక్షింతలు ఏమి చెయ్యాలో చాలామందికి తెలియదు. దేవుడి అక్షింతలు కాబట్టి వాటిని నెత్తిన వేసుకుని దేవుడికి దణ్ణం పెట్టుకోవడమో.. లేక దేవుడి గదిలో ఉంచడమో చేస్తుంటారు. అయితే ఈ  అక్షింతలను ఉపయోగించే విధానం గురించి పండితులు వివరించారు.

అయోధ్య రాముని పవిత్రమైన అక్షింతలు ప్రతి ఇంటికి చేరుకుని ఉంటాయి. సాధారణంగా పసుపు అక్షింతలు  జ్యోతిష్య శాస్త్ర  ప్రకారం పసుపు అక్షింతలు శుక్రగ్రహానికి చిహ్నంగా భావిస్తారు. ఈ అక్షింతలను ఇంట్లో భద్రపరిస్తే లక్ష్మీదేవి  ఆ ఇంట కొలువై ఉంటుందట. అయోధ్య రామ అక్షింతలను   ఎర్రని వస్త్రంలో కట్టి దేవుడి గదిలో భద్రపరచాలి. ఇలా చేస్తే లక్ష్మీ దేవి ఇంటికి వచ్చే మార్గం తెరచుకుంటుంది. అంతే కాదు ఈ అక్షింతలు ఇంట్లో ఉన్నంత కాలం ఇంట్లో ఏ అడ్డంకులు ఉండవని చెబుతున్నారు.

శ్రీరామ అక్షింతలు ఎప్పుడు ఎలా ఉపయోగించొచ్చంటే..

శ్రీ రామ అక్షింతలను శుభకార్యాలలో ఉపయోగించవచ్చు. ఇలా ఉపయోగిస్తే  ఆ శుభకార్యం విజయవంతమవడమే కాకుండా ఇంటిల్లిపాదికీ మేలు చేస్తుంది.

ఈ అక్షింతలను నైవేద్యంగా తయారుచేసి ఇంటిల్లిపాది తినవచ్చు.

ఇక ఇంట్లో ఐశ్వర్యం, సంతోషం ఉండాలన్నా, ఇంట్లో ఇబ్బందులన్నీ తొలగిపోవాలన్నా ఈ అక్షింతలను ఎర్రని వస్త్రంలో భద్రపరచి ఇంట్లో జాగ్రత్తగా ఉంచాలి.

ఈ అక్షింతలను పర్సుల్లో కూడా ఉంచుకోవచ్చట. దీనివల్ల డబ్బుకు ఎలాంటి కొరత ఉండదని కొందరు చెబుతున్నారు.

                                         *నిశ్శబ్ద.