అయోధ్య రామమందిరంలో ప్రాయశ్చిత్త పూజల ఆంతర్యం ఏమిటి?
అయోధ్య రామమందిరంలో ప్రాయశ్చిత్త పూజల ఆంతర్యం ఏమిటి?
అయోధ్యలో రామమందిర నిర్మాణం మొదలైనప్పటి నుండి దీని గురించి దేశం యావత్తూ చాలా చర్చలు జరుగుతున్నాయి. అక్కడ జరుగుతన్న ప్రతి చిన్న విషయం ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంటోంది. ఆదిపురుషుడు, ఆదర్శమూర్తి అయిన శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠకు ముందg అక్కడ ప్రాయశ్చిత్త పూజలు నిర్వహిస్తున్నారు. అసలు ఈ ప్రాయశ్చిత్త పూజలు ఎందుకు చేస్తారు? వీటి వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి? పూర్తీగా తెలసుకుంటే..
జనవరి 16 మంగళవారం నుండి అయోధ్యలోని రామ మందిరంలో పూజలు మొదలయ్యాయి. ఉదయం 9:30 గంటలకు ప్రారంభమైన పూజ దాదాపు 5గంటలు కొనసాగింది. దీన్ని ప్రాయశ్చిత్త పూజగా పిలుస్తున్నారు. 121మంది బ్రాహ్మణులు ఈ పూజకు ప్రాతినిధ్యం వహించారు. ఈ ప్రాయశ్చిత్త పూజ నిర్వహణకు కొందరు నిర్వాహకులుగా ఉన్నారు. శారీరక, అంతర్గత, మానసిక, బాహ్య.. ఇలా అన్ని విధాలుగా ప్రాయశ్చిత్తం చేసే ఆరాధనా పద్దతినే ప్రాయశ్చిత్త పద్దతి అంటారు. బాగ్య ప్రాయశ్చిత్తం ప్రక్రియ నిర్వహించే నిర్వాహకులు 10కర్మ స్నానాలు చేస్తారట. ఇందులో పంచ ద్రవ్యాలు, ఇతర పదార్థాలు ప్రాధానంగా ఉన్నాయి. వీటితో పాటు గోదానం, బంగారం కూడా దానం ఇస్తారు.
ప్రాయశ్చిత పూజను సాధారణ పండితులు నిర్విహించరు. దీన్ని తలపెట్టిన యజమాని మాత్రమే నిర్వహిస్తారు. తెలిసి చేసినా, తెలియక చేసినా పాపాలకు ప్రాయశ్చిత్తం చేయాలనేది ఈ ఆరాధన వెనుక ఉన్న ప్రాథమిక ఆలోచన. ఏమైనా తప్పులుంటే క్షమించమని అడగడానికి ఇలాచేస్తారు. ఇది ఒకరకరమైన శుద్ది పూజగా పరిగణిస్తారు.
యాగశాల పూజ..
ప్రాయశ్చిత్త పూజ ముగిసిన తరువాత కర్మకుటి పూజలు కూడా చేస్తారు. కర్మకుటి పూజను యాగశాల పూజ అని కూడా అంటారు. ఇందులో మొదట విష్ణువుకు పూజ చేస్తారు. ఆ తరువాత మాత్రమే ఆలయంలోకి ప్రవేశిస్తారు. అంతేకాదు ఆలయంలో ప్రతి ప్రాంతంలోకి వెళ్లేముందు పూజలు నిర్వహిస్తారు. ఇదంతా జరిగిన తరువాత మాత్రమే మిగిలిన పూజలు మొదలవుతాయి.
*నిశ్శబ్ద.