దైవ అనుగ్రహం కావాలంటే.. ఉదయం పూజలో ఈ 5 పొరపాట్లు నివారించండి..!
దైవ అనుగ్రహం కావాలంటే.. ఉదయం పూజలో ఈ 5 పొరపాట్లు నివారించండి..!
హిందూ మతంలో ఉదయం పూజకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. దైవ స్మరణతో రోజును ప్రారంభిస్తే వారి జీవితం ఆనందంతో, శ్రేయస్సుతో నిండి ఉంటుంది. రోజంతా పాజిటివ్ శక్తి ప్రవహిస్తుందని నమ్ముతారు. అట్లాగే ఉదయం పూజ ఇంటికి పాజిటివ్ వాతావరణాన్ని తీసుకురావడమే కాకుండా ఆధ్యాత్మిక వృద్ధి, పురోగతి, ఆర్థికంగా ఎదుగుదల వంటివన్నీ సుగమం అవుతాయి. అంతేకాదు.. ఉదయం పూజ వల్ల దైవునితో కనెక్ట్ కావడం జరుగుతుంది. దీని వల్ల శాంతి, ప్రశాంతత కూడా లభిస్తాయి. అయితే పూజ చేయడం అంటే ఇష్టమొచ్చినట్టు చేయడం కాదు.. దీనికి కూడా కొన్ని నియమాలు ఉంటాయి. ఆ నియమాలను ఉల్లంఘిస్తే పూజ ఫలితం ఉండదు. ఇంతకీ ఉదయం పూజలో చేయకూడని పొరపాట్లు ఏమిటి? తెలుసుకంటే..
మత విశ్వాసాల ప్రకారం మురికిగా, లేదా చిరిగిన దుస్తులను వేసుకుని దేవునికి పూజ చేయడం చాలా తప్పు. ఇది ప్రతికూల శక్తిని ప్రసారం చేస్తుంది, ఇంటి ఆనందాన్ని, శ్రేయస్సును ప్రభావితం చేస్తుంది. కాబట్టి మురికి దుస్తులతో లేదా చెరిగిన వస్త్రాలు ధరించి పూజ చేయకూడదు.
పూజలో దీపానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. దానిని ఎప్పుడూ ప్లేట్ లేదా స్టూల్‌పై వెలిగించాలి. మత విశ్వాసాల ప్రకారం నేలపై నేరుగా దీపం వెలిగించడం వల్ల దురదృష్టం వస్తుంది. ఇత్తడి లేదా రాగి వంటి లోహ ప్లేట్ల మీద దాపాన్ని ఉంచి వెలిగించడం మరింత శ్రేష్టం.
సాధారణంగా పూజ చేసే సమయంలో అక్షంతలు వాడటం సహజం. దేవుడి పూజలో వినియోగించే అక్షంతలను బియ్యంతోనే తయారు చేస్తారు. అయితే విరిగిన బియ్యంతో అక్షంతలు చేసి దేవుడికి ఉపయోగించకూడదు. అందుకే అక్షంతలకు ఎంచుకునే బియ్యం బాగుండేలా చూసుకోవాలి.
దేవతలకు పూజలో పువ్వులను సమర్పించడం సహజం. అయితే పూజలో దేవుడికి సువాసనగల పువ్వులను మాత్రమే సమర్పించాలి. వాడిపోయిన లేదా పాతబడిన పువ్వులను సమర్పించడం అశుభం. ఇది దరిద్రాన్ని తెస్తుంది.
పూజ సమయంలో వెలిగించిన దీపం నుండి మరొక దీపం వెలిగించకూడదు. అలాగే దీపాలను నేరుగా అగ్గిపుల్లతో వెలిగించకూడదు. అలా చేయడం అశుభకరం. దీపాలను వెలిగించడానికి ఏకవత్తి దీపాన్ని ఉపయోగించాలి. లేదంటే అగరువత్తితో అయినా దీపాన్ని వెలిగించాలి.
*రూపశ్రీ.