రోజూ పూజ చేసేవారు చేయకూడని త ప్పులు, పాటించాల్సిన నియమాలు!
రోజూ పూజ చేసేవారు చేయకూడని త ప్పులు, పాటించాల్సిన నియమాలు!
హిందూ మతంలో పూజకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. వారంలోని ప్రతి రోజు ఏదో ఒక దేవుడికి లేదా దేవతకు పూజ చేస్తూనే ఉంటాం. అందుకే ప్రతిరోజు ఉదయం, సాయంత్రం ఇళ్లలో పూజ చేస్తూనే ఉంటాం. ఏ దేవుడిని అయినా సరే భక్తితో పూజిస్తే .. కుటుంబంలో ఎల్లప్పుడూ ఆనందం, అభివృద్ది ఉండనే ఉంటాయి. జీవితంలో ఐశ్వర్య ప్రాప్తి కూడా ఉంటుంది. అయితే ఇవన్నీ భగవంతుని అనుగ్రహం కలిగితేనే వస్తాయి. భగవంతుని అనుగ్రహం పొందేందుకు భక్తులందరూ విధిగా పూజలు చేస్తారు. అయితే సరైన సమయంలో, సరైన నియమాలతో పూజ చేసినప్పుడే పూజ చేయడం వల్ల పుణ్య ఫలితాలను పొందుతారు.
సాధారణంగా కొందరు ఏ సమయంలో అంటే ఆ సమయంలో పూజ చేస్తారు. అలా చేయడం అశుభం. దైవారాధనకు సంబంధించిన అనేక నియమాలు గ్రంథాలలో పేర్కొనబడ్డాయి. అవి పాటించవలసిన అవసరం ఎంతో ఉంది. పూజకు సంబంధించిన కొన్ని నియమాల గురించి తెలుసుకుని వాటిని పాటించడం వల్ల పూజ వల్ల సరైన పుణ్యఫలం పొందే అవకాశం ఉంటుంది.
ఏ సమయం మంచిది..
హిందూ ధర్మంలో విశ్వాసాల ప్రకారం పూజ చేసే సమయాన్ని బట్టి దానికి కొన్ని పేర్లు నిర్దేశించబడ్డాయి. ఇవి అయిదు విధాలుగా ఉన్నాయి. తెల్లవారుజామున 04:30 నుండి 5:00 గంటల వరకు మొదటి పూజ చేయవచ్చు. బ్రహ్మ ముహూర్తంలో చేసే ఈ పూజ చాలా విశిష్టమైనది. ఉదయం 09:00 గంటల నుండి రెండవ పూజ చేస్తారు. మధ్యాహ్నం 12:00 గంటల నుండి మధ్యాహ్న పూజ చేస్తారు. సాయంత్రం 04:30 నుండి సాయంత్రం . 6:00 గంటల వరకు పూజ చేస్తారు. ఇక ముగింపుగా శయన పూజ రాత్రి 9:00 గంటలకు చేయవచ్చు. ఇక్కడ పేర్కొన్న సమయాలలో ఏ సమయంలో అయినా భక్తితో సమయానికి తగిన స్తోత్రాలతో దేవుడి పూజ చేయవచ్చు. కానీ మధ్యాహ్న సమయంలో మాత్రం పూజ చేయకూడదు. ముఖ్యంగా మధ్యాహ్నం 12 గంటల నుండి 3 గంటల మధ్య అస్సలు పూజలు చేయకూడదు. ఈ సమయంలో పూజ చేసినా కూడా ఫలితం ఉండదు.
పూజ చేసేటప్పుడు పాటించాల్సినవి..
పూజ సమయంలో ఎల్లప్పుడూ ముఖాన్ని తూర్పు లేదా ఉత్తరం వైపు ఉంచాలి. తూర్పు లేదా ఉత్తరం ముఖంగా పూజించడం వల్ల ఇంట్లో సంతోషం కలుగుతుంది. ఆ భగవంతుని ఆశీర్వాదం ఇంటిల్లిపాదిపై ఉంటుంది. పూజ సమయంలో కుడి వైపున గంట, ధూపం, దీపం, అగరువత్తులు, పూజ సామగ్రిని ఉంచాలి. పూజ సమయంలో ఇవన్నీ గుర్తుంచుకుని అప్పుడు పూజ చేయాలి. మరీ ముఖ్యంగా పూజ సమయంలో దేవుడి మీద ధ్యాస ఉండటం తప్పనిసరి.
*నిశ్శబ్ద.