గురువారం తులసి చాలీసా పఠిస్తే జరిగేదేంటో తెలుసా..

 

గురువారం తులసి చాలీసా పఠిస్తే జరిగేదేంటో తెలుసా?

విష్ణువుకు తులసి చాలా ప్రీతికరమైనది. తులసి మాతను పూజిస్తే విష్ణువు త్వరగా ప్రసన్నుడవుతాడు. విష్ణువు అనుగ్రహం ఉంటే  అన్ని కోరికలు తీరతాయి.  కష్టాల నుండి గట్టెక్కుతారు.  దీనితో పాటు ఆదాయం,  అదృష్టం కూడా పెరగుతుంది. అందుకే  ప్రతిరోజూ తులసి మాతను పూజిస్తారు. ఇంట్లోని స్త్రీలు ప్రతిరోజూ స్నానం చేసి ధ్యానం చేసిన తర్వాత తులసి మాతకు నీటిని సమర్పించడం ప్రతి ఇంట్లో కనిపించేదే .

ఇక ఇంట్లో ఐశ్వర్యం పెరగాలన్నా, అదృష్టం కలిసిరావాలన్నా, విష్ణుమూర్తి అనుగ్రహం నిండుగా ఉండాలన్నా కూడా తులసి పూజ చేయడం, తులసిమాత అనుగ్రహాన్ని పొందడం తప్పనిసరి. ఇక ప్రతి గురువారం సాయంత్రం తులసిమాత ముందు నెయ్యి దీపారాదన చాలా ప్రాశస్తమైనది. నెయ్యి దీపాలు వెలిగించిన అనంతరం తులసిమాతకు హారతి ఇచ్చి ఆ తరువాత తులసి చాలీసా పఠిస్తారు.  దీంతో ఇంట్లో ఆనందం, ఐశ్వర్యం, సౌభాగ్యం కలుగుతాయి. ఇక్కడ మరొక విషయం ఏమిటంటే.. తులసి మాత అనుగ్రహం పొందాలంటే తులసిమాతతో పాటూ విష్ణువును, విష్ణువు అనుగ్రహం కావాలంటే  విష్ణువుతో పాటూ తులసిమాతను పూజించాలి. ఇలా చేస్తే ఇద్దరి అనుగ్రహం ఇంటి పైన ఉంటుంది.   గురువారాన్ని లక్ష్మీవారం అని కూడా అంటారు. అందుకే ఈరోజు తులసితో పాటూ విష్ణువును  పూజించడం వల్ల  సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. కష్టాలు గట్టెక్కుతాయి.

                    *నిశ్శబ్ద.