సంతానం లేని వారికి గొప్ప వరం ఆస్రా మాత ఆలయం..!

 

సంతానం లేని వారికి గొప్ప వరం ఆస్రా మాత ఆలయం..!


మధ్యప్రదేశ్‌లోని ఖండ్వా జిల్లాలో తక్లి మోరి గ్రామంలో నదీ తీరంలో నిర్మించిన  ఆస్ర మాత ఆలయం ఉంది.  ఈ ఆలయానికి వెళ్లే వారు ఎవరూ ఒట్టి చేతులతో తిరిగి వెళ్లరని అంటారు.  లక్షలాది మందికి ఈ ఆలయం నమ్మకానికి పెట్టింది పేరు. ఈ ఆలయం చిన్నదిగా కనిపించినప్పటికీ, దాని అద్భుతాలు , నమ్మకాలు చాలా గొప్పవని చెబుతారు. . స్థానిక పెద్దలు ఈ ఆలయం సుమారు 1,000 సంవత్సరాల పురాతనమైనది చెబుతున్నారు. శతాబ్దాలుగా ప్రజలు తమ సమస్యలతో ఇక్కడికి వస్తున్నారని, ఇక్కడి  అమ్మవారు వారి కోరికలు తప్పకుండా తీరుస్తుందని అంటున్నారు.  ఈ ఆలయం గురించి మరింత వివరంగా తెలుసుకుంటే..

ఆస్రా మాత.. సంతానం లేని వారికి అభయం..

ఈ ఆలయం  గొప్పతనం ఏమిటంటే, ఇక్కడికి వచ్చే ప్రతి స్త్రీకి సంతానం కలుగుతుందట. పెళ్లై చాలా సంవత్సరాలు గడిచినా సంతానం కలగని స్త్రీలు కోరిక కోరుకోవడానికి ఇక్కడికి వస్తారుట.  అమ్మవారి ఆశీస్సులతో ప్రతి మహిళ ఒడి పిల్లలతో నిండి,  ఆనందాన్ని తీసుకువస్తుందట. అందుకే ఖండ్వా నుండే కాకుండా ఇండోర్, ఉజ్జయిని, భోపాల్, దేవాస్ , గ్వాలియర్ వంటి ప్రధాన నగరాల నుండి కూడా మహిళలు ఇక్కడికి పెద్ద సంఖ్యలో వస్తారట. కోరిక తీరిన తర్వాత , ప్రజలు అమ్మవారికి   కృతజ్ఞత చెప్పడానికి కుటుంబంతో కలిసి మళ్లీ వస్తారట.

పాటించాల్సిన నియమం..

ఈ ఆలయానికి ఒక ప్రత్యేకమైన పూజా సంప్రదాయం ఉంది. ఆలయానికి సమీపంలోనే ఒక అందమైన చిన్న నది ప్రవహిస్తుంది.  ఆలయాన్ని సందర్శించే ముందు, ప్రతి భక్తుడు ఈ నదిలో స్నానం చేయాలి. దీని తర్వాత మాత్రమే  ఆలయంలోకి ప్రవేశం ఉంటుంది.  స్త్రీలు  ఇక్కడికి వచ్చి వరుసగా ఐదు మంగళవారాలు పూర్తి భక్తిశ్రద్ధలతో పూజిస్తే, అమ్మవారు  కోరిక తీరుస్తుందని నమ్మకం.

మాఘమాసంలో ప్రత్యేకం..

భక్తులు ఏడాది పొడవునా ఇక్కడికి తరలివస్తుంటారు, కానీ హిందూ క్యాలెండర్ ప్రకారం మాఘ మాసంలో ఇక్కడి దృశ్యం  అద్భుతంగా ఉంటుంది. మాఘ మాసంలోని మొదటి 15 రోజులలో, ఆలయ ప్రాంగణంలో కనీసం ఒక నువ్వు గింజకు కూడా చోటు ఉండదట.  ఈ సమయంలో, గ్రామంలోని వివాహిత స్త్రీలు తమ అత్తమామలు , తల్లిదండ్రులతో కలిసి, అమ్మవారి ఆశీర్వాదం కోసం ప్రత్యేకంగా వస్తారట. ఈ  మాసంలో భోజనాలు చేయడం వంటివి కూడా చేస్తారట.  భజనలు, కీర్తనలతో  గ్రామం భక్తిలో మునిగి తేలుతుందని చెబుతారు.

సైన్స్ కు చిక్కని రహస్యం..

ఆస్ర మాత ఆలయంలో జరిగే ఈ  అద్భుతం నేటికీ ఒక అంతుచిక్కని రహస్యంగానే మిగిలిపోయింది. శాతాబ్దాలుగా ఇక్కడికి వస్తున్న సంతానం లేని దంపతుల కోరికలు ఎలా నెరవేరాయో అనే ప్రశ్నకు ఆధునిక విజ్ఞానశాస్త్రం వద్ద కూడా సమాధానం లేదు. వైద్యుల చుట్టూ తిరిగి  విసుగు చెందిన వారు సైతం  అమ్మవారి  పాదాలకు నమస్కరించడానికి ఇక్కడికి వస్తారట. గ్రామస్తులు ఇది  తమ కులదైవం నుండి లభించిన  ఆశీర్వాదంగా భావిస్తారు. ఈ ఆశీర్వాదమే వారి అచంచలమైన విశ్వాసాన్ని తరతరాలుగా సజీవంగా ఉంచుతోంది.

మీ జీవితంలో ఎలాంటి ఆధ్యాత్మిక సందేహం ఉన్నా... దేవాలయాల విశేషాలు, పూజా విధానాలు, వ్రతాలు, పండుగల ప్రాముఖ్యత, స్తోత్రాలు, మంత్రాలు, భక్తి కథలు వంటి ఎన్నో ఆధ్యాత్మిక విశేషాలు మా BhakthiOne యూట్యూబ్ ఛానల్‌లో అందుబాటులో ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 BhakthiOne (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)

 

                                    *రూపశ్రీ.