Read more!

Advantages of Wearing Heels

  A pair of high heeled shoes has been a good friend of women since thousands of years. Wearing high heels is an evergreen style statement indeed. Have a quick look at the advantages of wearing heels.   Tall Look : Wearing heels help to increase the height by 5-6 inches to the maximum. This is helpful for the women who love tall look. Most of the women like to feel attractive by having a tall look by wearing heels. Women also feel smart and in a proper shape by wearing heels.   Style : High heels give a stylish look to the overall physical appearance of women. Nothing can look hot with a mini fitting skirt than high heeled boots. An open toe sandal with a two inch heel looks quite decent with a Chudidaar. In addition to style it also gives lot of attention. It also adds style to the way you walk.   Good Body Posture : After wearing heels women get a feeling of having a good posture. Heels help to bring out and attractive body posture. It also adds to the confidence of the women while carrying her self. The exception to this is the woman who rarely wears heels. Some women may fall in embarrassment if they wear very high heels for the first time. If you buy a pair of high heel sandals do practice walking at home with them. This will help you to avoid possible awkwardness when you actually go out.   Good looking legs : Heels help to enhance the beauty of your legs. Those who like to wear short skirts can make their legs look more gorgeous with the help of stunning heels. Heels make legs look longer and shapelier.   Complementary to Clothes : Heels compliment the attractiveness of the clothes. Box or conical heels go well with the corporate attire. Pencil heels make the minis or tunics look more striking. Wearing platform heels with trousers or wide bottom jeans will give a cool look. If you do not want to show off your heels but look tall wear it with saris or long skirts.  

ITS RAINING FASHIONABLE FOOTWEARS

The monsoon fashion footwear collection is out. Very suitable for Indian women. Its drizzles, raining..sometimes heavily raining… In such situations… walking in the muddy puddles and water clogged streets is invariably hateful. But… Not to worry… rainy season footwear…monsoon footwear fashion collection has got to a wide range of footwear suitable for all ages Indian women.   CROCS These footwear are light weighed, easy to put on. Great for walking in light rains and muddy streets. Made out of PCCR, they come in bright single color or bi-colored combinations. This goes well with casual pair of jeans     Ballet Flat Crocs In Light Blue To Wear With Your Jeans On A Rainy Day.   RAIN BOOTS Rain boots help to keep your feet dry – even on days with heavy rain and water-clogged streets! Usually calf length and made out of rubber, they come in various stylish and fun designs. Ranging from classic to trendy, they’ll add oomph to your rain poncho and leggings attire!     Bright Yellow Polka Dotted Rain Boots With Buckles   JELLY SHOES Jelly shoes are back! Made out of PVC plastic, they are available in wide range of colors. Some have the glittering shine too. Stylish, Easy to wear & Comfortable. They always make a style statement and are great for days with light to moderate rain.   Electric blue jelly shoes in gladiator style   RAIN SHOESs Made out of rubber or PVC, they can be worn during light as well as heavy rains. Offered in trendy, stylish designs and colors. Shorter than rain boots with shoe-laces. Goes well with both formal and casual pants or jeans.   Indigo ankle length rain shoes with black and white polka dotted lace   So walk out boldly from house…. In Style! Stylish….. Trendy….& Yes Of Course Safe to walk… :D

Easy Ways to Update Your Fall Wardrobe

  No need to buy complete, head-to-toe ensembles to look like you have a fashion clue. Any one of these 10 easy pieces will make you look instantly updated.   1. Skinny Jeans : Nothing says "now" better than sleek, dark-dye jeans with slim legs. Balanced with volume on top (a tunic works great), these jeans make your legs look miles long. 2. Sweater Coat : Yummy knits are hot for fall, so top your career or casual looks with a mid-thigh-length sweater coat for a softer look. Or pair a duster-length sweater coat with a jersey dress for a cozy change. 3. Purple : Purple hues look great on just about everyone -- from sweet lilac to deep plum -- so indulge in at least one purple item this fall for a pop of fresh color. 4. Black Tights : Maybe the least expensive update to your wardrobe this season is a pair of opaque tights. The best ones are in black, worn with black shoes, with everything from paisley silk dresses to miniskirts. But you can also experiment with bright colors or footless versions for a legging look. 5. Flat Boots : Forget towering heels: flat -- slouchy or sleek -- boots take center stage as the must-have footwear for fall. Tuck your skinny jeans into a pair for an instantly casual chic look. 6. Wide Belt : Shift the focus to your waist with a wide belt, worn higher and tighter than in previous seasons (no slouchy, hip-hugging styles, please). 7. Handbag with Chains : Heavy embellishment may be out, but bold hardware -- especially chains -- add just the right touch of tough to oversized bags. 8. Black : Put away the frills and pastels: black is back and bigger than ever. You can wear head-to-toe black, just remember to mix up fabrics to keep it interesting (wear a chunky knit sweater with black jeans, pair a silky black blouse with black wool pants, etc.) 9. Red Lips : Get the perfect autumn pout with a splash of red lipstick. After seasons of nude lips, the color looks amazing (not to mention how white your teeth look with it). 10. Daytime Dresses : In contrast to fall's complicated layers (shirt, vest, menswear blazer, etc.) you need the relief of one-piece dressing for daytime. Jersey dresses look sensual in earth tones and prints range from graphic to menswear. Pair with black tights and short booties or pumps for an instant update (and a great way to keep your gams toasty in chilly weather).

అదరగొడుతున్న హెయిర్ బ్యాండ్స్...

  ఆడవాళ్ళ అలంకరణలో డ్రెస్సులు, చెప్పులు, లిప్ స్టిక్ లు వంటివే కాకుండా హెయిర్ స్టైల్ ను మరింత అందంగా చూపించే హెయిర్ బ్యాండ్ లకు కూడా మరింత క్రేజ్ పెరిగింది. డ్రెస్సులకు, హెయిర్ స్టైల్ లకు తగ్గట్లుగా రకరకాల మోడల్స్ తో, స్టైల్ లతో ఆదరగొడుతున్నాయి. హెయిర్‌ బ్యాండ్‌, రిబ్బన్లు ఇప్పుడు కొత్త తరహాలో లభిస్తున్నాయి. పెద్ద వారికోసమే కాకుండా పిల్లల కోసం కూడా ప్రత్యేకమైన హెయిర్ బ్యాండ్ లు లభిస్తున్నాయి. హెయిర్‌ బ్యాండ్‌ తలపై భాగాన ధరిస్తే స్పోర్టివ్‌గా వుంటుంది. దీనికోసం మార్కెట్లో అందమైన రంగుల్లో క్లాత్‌ కూడా లభిస్తుంది. మరికొన్ని ప్లాస్టిక్‌ వుండి నాజూకుగా వుంటాయి. గ్రీన్‌, పర్పుల్‌ ఇలా ఎవరికి నచ్చిన రంగులను వారు ఎంపిక చేసుకోవచ్చు. హెయిర్‌ బ్యాండ్స్‌, వేసే వస్త్రధారణ, షూలను బట్టి వుంటుంది. అందమైన, రంగుల హెయిర్‌ బ్యాండ్స్‌ను ఎన్నిక చేయాలి. పుష్పాలు, సీతాకోకచిలుకలు, రకరకాల ప్రింట్స్‌ గలవి చూడటానికి ఇంపుగా వుంటాయి.         వాడే దుస్తులను బట్టి హెయిర్‌ బ్యాండ్స్‌ను మ్యాచ్‌ అయ్యే విధంగా సెలెక్ట్‌ చేసుకోవాలి. ప్రస్తుతం మార్కెట్లో అన్ని రకాల లేటెస్ట్ ట్రెండ్ మోడల్ హెయిర్ బ్యాండ్ లు దొరుకుతున్నాయి. వీటి ధర మాములుగా ఇరవై నుండి మొదలుకొని వేల రూపాయల వరకు కూడా లభిస్తున్నాయి. హెయిర్ బ్యాండ్ అనేది ఆడవాళ్ళ అందానికి మరింత సొగసును చేకూరుస్తుంది.        

డిజైనర్ శారీలకు పెరుగుతున్న క్రేజ్

  చీర కట్టుకుంటే మహిళల అందం పెరుగుతుందని చెప్పలేం కానీ... మన తెలుగింటి ఆడపడచులు మాత్రం చీర కట్టుకుంటే ఆ చీరకే అందం వస్తుందన్నది మాత్రం అతిశయోక్తి కాదు. ఎలాంటి చీరనైనా అందంగా మలచగల సృజన, కళాత్మకత మనవారి సొంతం. ఒక చిన్న అల్లిక, మరో చిన్న అతుకు, ఒక పూస లాంటివి చేర్చినా ఆ చీర డిజైనర్ చీరలకు ఏమాత్రం తీసిపోదు. అనేక రకాలుగా డిజైన్ చేసిన వీటిని ధరించే స్త్రీలు ఎక్కడికెళ్లినా సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ అవుతారనడంలో సందేహం లేదు.   లేటెస్ట్ ఎంబ్రాయిడరీ, దానికి మరింతగా అందాన్నిచ్చే కుందన్స్, స్టోన్స్, వీటన్నింటినీ డామినేట్ చేసే పల్లూ, స్వచ్ఛమైన జరీతో మెరిసిపోయే చీరలు ప్రస్తుతం అమితంగా మహిళలను ఆకట్టుకుంటున్నాయి. ఆకర్షణీయమైన రంగుల్లో, అపురూపమైన డిజైన్లతో ఉన్న ఈ చీరలు మహిళలను అల్లుకుపోయి మరింత అందంగా కనిపిస్తున్నాయి.     డిజైనర్ చీరలంటే ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. ముఖ్యంగా ఈనాటి అమ్మాయిలు వీటిపై ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎప్పుడైనా ఫంక్షన్లకు, వివాహ కార్యక్రమాలకు పట్టుచీరలకంటే ఇప్పుడు వీటినే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అయితే డిజైనర్ చీరలంటే ధరలు మాత్రం మాములుగా ఉండవు. వెయ్యి రూపాయల నుండి మొదలుకొని దాదాపు లక్ష రూపాయల పై వరకు కూడా మార్కెట్లో లభిస్తున్నాయి.   అయితే చిన్నపాటి జాగ్రత్తలు, కాస్తంత సృజన జోడిస్తే... మీ దగ్గరుండే సాదా చీరలనే అందంగా తయారు చేసుకుని డిజైనర్ శారీలను తలదన్నేలా తీర్చిదిద్దవచ్చు. మరి మీకు అలాంటి శ్రమ ఎందుకులే అనుకుంటే.. మార్కెట్లో అదిరిపోయే డిజైన్ లలో డిజైనర్ శారీలు లభిస్తున్నాయి. వెళ్లి ఓసారి షాపింగ్ చేసేయండి మరి.

మనసుదోచే మువ్వల పట్టీలు

వయసుతో ఎటువంటి సంబంధం లేకుండా చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఆడవాళ్లందరూ ఇష్టపడేవి కాలి పట్టీలు. గొలుసులు, గాజులతోపాటు ఆడవాళ్ళు రోజూ ధరించే ఆభరణంగా స్థిరపడిపోయాయి కాలి పట్టీలు. కాస్త అడుగులేసే వయసు రాగానే కూతురుకు ముందుగా మువ్వల పట్టీలు చేయించి పెడతారు అమ్మా నాన్నలు. వారి బుజ్జి బుజ్జి అడుగులకు ఆ మువ్వల గలగలలు తోడై ఇల్లంతా తిరుగుతుంటే మురిసిపోతారు.     ఈనాటి అమ్మాయిలకు సంప్రదాయ దుస్తులు ధరించడమే బద్ధకంగా భావిస్తున్నారు. కానీ, కాలి పట్టీలు కూడా కాలానుగుణంగా తమ రూపురేఖలు మార్చుకుని ఆధునికతను సంతరించుకున్నాయని వారు తెలుసుకోవడం లేదు. పట్టు లంగా, వోణీ వేసుకున్నా, జీన్స్, టీషర్ట్ వేసుకున్నా వారి వస్త్రాధరణకు తగినట్టుగా ఎన్నో పట్టీలు మార్కెట్‌లో లభిస్తున్నాయి. అంతేకాదు, తమ అభిరుచికి తగ్గట్టుగా వాటిని మార్చుకుని, మాచింగ్‌గా కూడా చేసుకోవచ్చు.     సాధారణంగా కాలి పట్టీలు వెండి లేదా బంగారంతో తయారుచేస్తారు. కాని ఈరోజు మార్కెట్లో ఎన్నో రకాల కాలి పట్టీలు అందుబాటులో ఉన్నాయి. చెక్క పూసలు, బ్లాక్‌మెటల్, రంగు రంగుల పూసలు, రాళ్లు, ముత్యాలు, మువ్వలు, గొలుసులు.. చివరకు ప్లాస్టిక్ గొట్టాలు, లెదర్‌తో చేసిన పట్టీలు కూడా దొరుకుతున్నాయంటే నమ్ముతారా? ఇవి జీన్స్, స్కర్ట్స్, మినీస్, కాప్రీలు మొదలైన డ్రెస్సులకు అనువుగా మాచింగ్‌గా ఉంటాయి. అందుకే కాలేజీ అమ్మాయిలు ఇటువంటి అధునాతనమైన పట్టీలు పెట్టుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు.     అలాగని ఎప్పటికీ అవే వేసుకోవాలంటే కూడా ఇష్టపడరు. పెళ్లిళ్ళు, పార్టీల కోసం వారు ధరించే పట్టు, హెవీవర్క్ చీరలు, డ్రెస్సులకు ధీటుగా బంగారు నగలకు ఏ మాత్రం తీసిపోని పనితనంతో రంగు రంగుల రాళ్లు, ముత్యాలు, పూసలు, క్రిస్టల్స్ పెట్టి తయారుచేసిన కాలి పట్టీలు కూడా దొరుకుతున్నాయి. వెండి, బంగారంతో చేసినవి ఒకటో, రెండో కాలి పట్టీలు కొనుక్కునే బదులు ఇలాంటివి డ్రెస్సులకు మాచింగ్ ఉండేట్టు ఎన్నైనా కొనుక్కోవచ్చు.     అంతేకాదు అమ్మాయిలు తమ కొత్త డ్రెస్సులకు, అందులోని రంగులకు మాచింగ్‌గా కూడా పట్టీలు చాలా సులువుగా తయారుచేసుకోవచ్చు. ఇవన్నీ ఎక్కువ ఖరీదు కూడా ఉండవు. అందువలన ఈ పట్టీలు విరివిగా అమ్ముడవుతున్నాయి. పండగ, పెళ్లి, పార్టీ, పుట్టిన రోజు వచ్చినా, డ్రెస్సుతోపాటు కొనుక్కునే మాచింగ్ గాజులు, నగలలో కాలిపట్టీలు కూడా చేరిపోయాయి. ఎంతైన ఆ మువ్వల సవ్వడి వింటే అబ్బాయిలు కూడా ఫ్లాట్ అయిపోవాల్సిందే మరి.

కాటన్ చీరలకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి...?

  కాటన్ చీరలంటే చాలా మంది మహిళలకు ఎక్కవ ఇష్టం. ముఖ్యంగా మన భారతీయులు చాలా మంది కాటన్ చీరలను, కాటన్ దుస్తులను ధరించడానికి ఆసక్తి చూసిస్తున్నారు. వేసవిలో శరీరానికి చల్లదనాన్ని ఇస్తూ వంటికి హాయిని కలిగించేవి కాటన్‌ దుస్తులు. ఎండవల్ల కలిగే ఉక్కపోతని, చెమటవల్ల వచ్చే చికాకుని తప్పించుకోవటానికి కాటన్‌ దుస్తులని ధరించడం ఎక్కువ. కాటన్ చీరను ఎల్లప్పుడూ స్టిఫ్ గా, కొత్తవాటిలా మెరిపించాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలి. మరి అవేమిటో ఓసారి చూద్దామా...! బకెట్ గోరువెచ్చని నీటిలో రాళ్ల ఉప్పు కొద్దిగా వేసి ఒకేసారి మూడు కాటన్ చీరలను నానబెట్టాలి. ఎక్కువ సేపు నానబెట్టకుండా పది, పదిహేను నిమిషాలకే ఉతికేయాలి. దాంతో కాటన్ చీరలకున్న అందం, రంగు పోవు. మొదటి సారి ఇలా చేయడం వల్ల తర్వాత తర్వాత ఉతుకులకు ఎటువంటి హానీ జరగకుండా కాటన్ చీరను కాపాడుకోవచ్చు. సోప్ నట్స్ మార్కెట్లో దొరుకుతాయి. వాటిని ఉపయోగించడం వల్ల కూడా కాటన్ చీరలు ఎప్పటికీ ఫ్రెష్ గా ఉంటాయి. సోప్ నట్స్ నీళ్లలో వేసి అందులో చీరలను నానబెట్టి కొద్దిసేపటి తర్వాత శుభ్రం చేసేసుకోవాలి. మార్కెట్లో లభించే లిక్విడ్ స్టార్చ్ లో కాటన్ చీరలను నానబెట్టుట వల్ల అవి ముడతలు లేకుండా స్టిఫ్ గా ఉంటాయి. చీరలను ఉతికి శుభ్రపరిచిన తర్వాత స్టార్చ్(గంజి) పెట్టి ఎండలో కొద్దిసేపు మాత్రమే ఆరబెట్టి, ఆరిన తర్వాత వెంటనే తీసేయాలి. ఇక కాటన్ బట్టలు స్టిఫ్ గా ఉండాలంటే ఐరనింగ్ ముఖ్యం. ఐరన్ చేసే ముందు కాటన్ దుస్తులపై గల లేబుల్ ఒకసారి పరిశీలించండి. సాధారణంగా కాటన్ గుడ్డను ఐరన్ చేయవచ్చు. కాని చేసేముందు ఒకసారి చూడటం మంచిది. కాటన్ చీరలను కానీ కాటన్ ఏ ఇతర బట్టలు కానీ ఐరన్ చేసే ముందు ఆ వస్త్రంపై కొన్ని నీళ్ళు చిలకరిస్తే కాటన్ వస్త్రాలు త్వరగా ముడుతలు లేకుండా ఐరన్ చేయవచ్చు. స్టీమ్ ఐరన్ కనుక మీరు ఉపయోగిస్తున్నట్లయితే, గుడ్డ ఆటోమేటిక్ గా తేమను పీల్చుకుంటుంది. వేరుగా నీరు గుడ్డపై చిలకరించనవసరంలేదు. గుడ్డలకు గంజి పెట్టినట్లయితే కాటన్ గుడ్డలు దళసరిగా వుంటాయి. వాష్ చేసిన తర్వాత, ఐరన్ చేసే ముందు కొద్దిపాటి గంజిని గుడ్డలకు పట్టించటం మంచిది.

లేసింగ్ డ్రెస్సులపై కన్నేసిన యువత

  లేసింగ్‌ డ్రెస్సుల స్టైలే వేరంటున్నారు నేటి యువతులు. ఫ్యాషన్‌ ట్రెండ్‌లను సృష్టించే డిజైనర్స్‌కు కూడా ఈ డ్రెస్సులు నచ్చుతున్నాయంటే వీటి స్టైల్‌ ఏంటో తెలుస్తుంది. ఇవి ఫ్యాషన్‌ ట్రెండ్‌తో సంబంధం లేకుండా ఏ కాలంలో నైనా ఆడవాళ్లు వేసుకోవచ్చు. వీటిని ధరించినప్పుడు ఇవి రొమాంటిక్‌ ఫీలింగ్‌ను కలుగజేస్తాయి.   ఈ డ్రెస్సులే గాకుండా ఏదైనా లేస్‌లు లేనివి కూడా ప్రత్యేకంగా ఉంటాయి. యువతుల్ని పదిమందిలో ప్రత్యేకంగా కనిపించేటట్టు చేస్తాయి ఈ వెరైటీ దుస్తులు. ఇపుడు మార్కెట్లో లేసులతో జాకెట్స్‌, ఓవర్‌ కోట్స్‌ కూడా లభిస్తున్నాయి. పార్టీలకు, పబ్బులకు వెళ్ళినప్పుడు కానీ, లేదంటే ఏదైనా స్టైలిష్ ఫంక్షన్స్ లకు వెళ్ళినపుడు ఇలాంటి డ్రెస్సులు వేస్తే ఇక మీరే హీరోయిన్.  

అదిరేటి జిప్పర్‌ డ్రెస్సులు

  యువతీ,యువకులు కొత్తదనాన్ని కోరుకుంటారు. ఈ మేరకు ఫ్యాషన్‌ డిజైనర్లు వారి కోసం కొత్త ఫ్యాషన్‌ వస్త్రాలు, యాక్ససరీస్‌ను సృష్టిస్తుంటారు. ఈ నేపథ్యంలో యూత్‌ కోసం ప్రత్యేకంగా మొత్తం జిప్‌లతోనే వస్త్రాలను తయారుచేస్తున్నారు. ఈ డ్రెస్సులతో ఎలా కావాలంటే అలా క్షణాల్లో మారిపోవచ్చు.     ఈ జిప్పర్‌ డ్రెస్సు ప్రత్యేకత ఏంటంటే.. డ్రెస్సు ఒక్కటే అయినప్పటికీ, దీనిని పలురకాలుగా వినియోగించుకోవచ్చు. ఎలాగంటే నైట్‌డ్రెస్‌ దగ్గర్నుంచీ బెల్ట్ దాకా అలాగే లాంగ్‌ కోటుగా, మినీ స్కర్టుగా, స్లీవ్‌లెస్‌గా ఎలాగైనా వాడుకోవచ్చు. ఒక్క డ్రెస్సును వందరకాలుగా వాడడం సాధ్యమేనా అని ఆలోచించకండి. ఈ జిప్పర్‌లో అమర్చిన 120 జిప్‌ల సాయంతో దాన్ని రకరకాలుగా మార్చుకోవచ్చు. బెల్టు దగ్గర పూర్తి స్థాయిలో వేసుకునే వస్త్రాలుగా, మనకు కావాల్సిన విధంగా మలచుకోవచ్చు. మధ్యలోకి ఉన్న జిప్‌ను పూర్తిగా తీసివేసి నట్టయితే అది రెండుగా విడిపోతుంది. ఒక దాన్ని మినీ స్కర్టుగా, మరో దాన్ని టాప్‌గా వేసుకుని ఎంచక్కా పార్టీ లకు వెళ్ళిపోవచ్చు. ప్రస్తుతం ఫ్యాషన్‌ ప్రపంచంలో ఈ జిప్పర్‌ డ్రెస్‌కు విపరీతమైన ఆదరణ లభిస్తుంది.

రింగుల స్టైల్ కు పడిపోవాల్సిందే....

  అమ్మాయిలందరూ ఒకప్పుడు జుట్టును సన్నగా, సిల్కీగా ఉండేలా చూసుకునేవారు. కానీ ఇప్పుడంతా కొత్త లుక్ తో అదరగొడుతున్నారు. అమ్మాయిల హెయిర్ స్టైల్ లో ఎన్ని రకాలున్నాయో చెప్పడం కష్టం. అయితే ఇప్పుడంతా రింగు రింగుల హెయిర్ స్టైల్ పై మోజు పడుతున్నారు.   "హ్యాపీ డేస్" చిత్రంలో సోనియా రింగు రింగుల హెయిర్ స్టైల్ తో కనిపించినప్పటి నుండి ఆ స్టైల్ మరింత పాపులర్ అయ్యింది. ఈ జాబితాలో సోనియా ఒక్కతే కాదండోయ్... తాప్సీ, నిత్యమీనన్, హన్సిక, అయేషా శివ వంటి తారలు కూడా చేరారు.   పార్టీలు, పబ్బులకు, ఫంక్షన్ లకు వెళ్ళినప్పుడు ఈ హెయిర్ స్టైల్ వలన మరింత అందం వస్తుందని అమ్మయిలు భావిస్తున్నారు. అంతే కాదండోయ్... ఇలా రింగు రింగుల జుట్టు ఉన్న అమ్మాయిలను చూసి అబ్బాయిలు కూడా ప్రేమలో పడిపోతున్నారంటా.

స్ట్రాప్స్ లేని చెప్పులు

  ఫ్యాషన్ అంటే మనం వేసుకునే బట్టలే కాకుండా..కాళ్ళకు వేసుకునే చెప్పులు కూడా స్టైలిష్ గా ఉంటేనే బాగుంటుంది. కొత్తగా స్ట్రాప్స్ లేని చెప్పులు ఇప్పుడు యువతులను బాగా ఆకట్టుకుంటున్నాయి. మరి వాటి గురించి తెలుసుకుందామా...   నడిచేటప్పుడు మనం వేసుకున్న చెప్పులకు ఉన్న స్ట్రాప్స్ తెగిపోతేనే ఎలా నడవాలి అని ఆలోచిస్తారు. ఇపుడు స్ట్రాప్స్ లేకుండా ఎంచక్క నడవవచ్చు. అయితే వెనుక మడమల భాగంలో పెట్టుకునేందుకు బెల్టు ఉంటుంది. సో... మాములు చెప్పుల వలె వీటిని కూడా వేసుకొని నడవవచ్చు. దీనివల్ల మీ పాదాల మీద నల్లటి చారలు పడే అవకాశం కూడా ఉండదు. మరి ఇంకెందుకు ఆలస్యం... ఇలాంటి కొత్త కొత్త ఫ్యాషన్ ను ఫాలో అయిపోండి.