Read more!

హై హీల్స్ తో ఇబ్బందా.. ఇవి తెలుసుకుంటే సమస్య దూరం!

హై హీల్స్ తో ఇబ్బందా.. ఇవి తెలుసుకుంటే సమస్య దూరం!

ఫ్యాషన్ ప్రపంచం చాలా పెద్దది. వెతుక్కున్నంత కొత్తదనం అందులో ఉంటుంది. ప్రతి అమ్మాయి హైహీల్స్ ధరించడానికి ఇష్టపడుతుంది. వీటిని ధరించడం వల్ల అమ్మాయిలకు తాము ప్రత్యేకం అనే భావం కలగడమే కాకుండా ఫ్యాషన్‌గా కనిపిస్తారు. అమ్మాయిలు పొడవున్నారా లేదా పొట్టిగా ఉన్నారా అనే  విషయంతో సంబంధం లేకుండా హీల్స్ ధరించడానికి ఇష్టపడతారు.  అయితే ఎంత స్టైలిష్ గా ఉన్న అమ్మాయిలు  అయినా హీల్స్ వేసుకోవడం కచ్చితంగా కష్టమే. బయటకు కనిపించే అందం, ఆనందం లోపల ఉండదు. హీల్స్ ధరించడం వల్ల పాదాలలో నొప్పి వస్తుంది. మరోవైపు, శరీరానికి అనుగుణంగా ఉన్న హీల్స్ ధరించకపోతే, ఈ సమస్య మరింత పెరుగుతుంది.

చాలామంది అమ్మయిలకు హీల్స్ వేసుకున్నప్పుడు నొప్పి ఎందుకు వస్తుందంటే..

రోజూ హీల్స్ వేసుకోకపోవటం వల్ల హైహీల్స్ వేసుకోవడం అలవాటు చేసుకోకపోవటం చాలామందిలో కనిపిస్తుంది. అంటే ప్రత్యేక సందర్భాల్లో, పార్టీలకు వెళ్ళాల్సినప్పుడు మాత్రమే హీల్స్. వేసుకుంటూ ఉంటారు. ఇలాంటి అలవాటు ఉన్నవారు  హైహీల్స్ ధరించడం వల్ల, పాదాలు నొప్పి పుడతాయి. పాదాలు  సాగదీసినట్టుగా అనిపిస్తాయి. దీని కారణంగా అమ్మాయిలు అప్పుడప్పుడు హై హీల్స్ వేసుకున్నప్పుడు  చాలా అసౌకర్యంగా ఫీలవుతారు.  మరికొందరు హైహీల్స్ ధరించడానికి దూరంగా ఉంటారు. ఇలా కాకుండా ఉండాలంటే కొన్ని టిప్స్ పాటించాలిమ్ అప్పుడు హీల్స్ వేసుకోవడం ఎంతో ఈజీ..

హీల్స్  కొనుగోలు చేసేటప్పుడు మడమల పరిమాణాన్ని గుర్తుంచుకోండి

హీల్స్ కొనుగోలు చేసేటప్పుడు దాని పరిమాణాన్ని గుర్తుంచుకోండి. హీల్స్ వదులుగా ఉంటే.. కాలు మళ్లీ మళ్లీ తిరగడం ప్రారంభమవుతుంది. మరోవైపు, మడమలు గట్టిగా ఉంటే, అసౌకర్యానికి గురవుతారు. కాబట్టి కాలి మడమలకు సరిగ్గా సరిపోయేలా హీల్స్ ఉండాలి. మడమ ప్రాంతాల్లో మెత్తగా ఉండే హీల్స్ కొనుగోలుచేయాలి. 

ముందుగానే ప్రాక్టీస్ బెస్ట్..

ఏదైనా ఈవెంట్ కు వెళ్లాలని అనుకున్నప్పుడు ఈవెంట్‌కు ముందే  హీల్స్ ధరించడం, నడవడం ప్రాక్టీస్ చేయాలి. దీనివల్ల ఈవెంట్ సమయానికి బాగా నడవడం అలవాటు అయిపోతుంది.  అలాగే హీల్స్ వేసుకున్నప్పుడు పాదాలలో నొప్పి ఉంటే, ఖచ్చితంగా ఫుట్ వ్యాయామాలు చేయాలి.

బ్లాక్ హీల్స్‌తో మొదలు...

ఇప్పటి వరకు ఎప్పుడూ హీల్స్ ధరించకపోతే, ముందుగా బ్లాక్ హీల్స్ ప్రయత్నించాలి. ఇవి పూర్తిగా బ్యాలెన్స్ ఇవ్వడానికి సపోర్ట్ అవుతాయి.  మొదటిసారి పెన్సిల్ హీల్స్ ధరించకూడదు. పంప్ హీల్స్ ప్రయత్నించవచ్చు.

పెన్సిల్ హీల్స్ ధరించకూడదనుకుంటే, పంప్ హీల్స్ ధరించడంతో ప్రారంభించడం మంచిది. . 2-3 అంగుళాల పొడవైన హీల్స్ కంటే పొడవైనవి మొదట్లోనే ఉపయోగించద్దు.  

ఇవి పాటిస్తే.. హీల్స్ వేసుకున్నప్పుడు ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. మీరూ చక్కగా మోడల్ లాగా వాక్ చేయొచ్చు.

                                       ◆నిశ్శబ్ద.