మేకప్ బ్రష్ వాడే ప్రతి ఒక్కరూ ఈ విషయం తెలుసుకోవాలి!

మేకప్ బ్రష్ వాడే ప్రతి ఒక్కరూ ఈ విషయం తెలుసుకోవాలి!

ఇప్పటికాలం అమ్మాయిలకు మేకప్ సర్వసాధారణం అయిపోయింది. బయటకు వెళ్లాలంటే కచ్చితంగా మేకప్ వేసుకునే వెళ్ళాలి. ఒకప్పటిలా కాసింత పౌడర్ చేతుల్లో వేసుకుని ముఖానికి రుద్దుకుని వెళ్లే కాలం కాదిది. మేకప్ యుగంలో మేకప్ వేసుకోవాడనికి చాలా మేకప్  ప్రొడక్ట్స్, మేకప్ బ్రష్ లు వాడుతూ ఉంటారు.  అయితే ప్రొడక్ట్స్ కొనుగోలు చేయడం, వాటిని వాడటం ఒక ఎత్తు అయితే మేకప్ బ్రష్ లను శుభ్రపరచం  మరొక ఎత్తు. మేకప్  బ్రష్ లను కనీసం వారానికి ఒకసారి శుభ్రపరుస్తూ ఉండాలట. లేకపోతే యాక్… చీ.. అంటున్నారు. ఇంతకూ అసహ్యించుకోవలసినంత దారుణం అందులో ఏముంది తెలుసుకుంటే.. 

ముఖానికి మేకప్ వేసుకునే అమ్మాయిలు వాటిని ఎన్ని సార్లు ఎప్పుడు శుభ్రం చేస్తారో వారికే ఎరుక. మేకప్ వేసుకుని తరువాత అలా వదిలేస్తే.. ఆ బ్రష్ లలో దారుణమైన క్రిములు చేరిపోతాయట. పరిశోధనల ప్రకారం టాయిలెట్ సీట్ లో ఉన్నంత దారుణమైన బాక్టీరియా మేకప్ బ్రషులో కూడా ఉంటుందని, వాటిని రోజుల తరబడి శుభ్రం చేయకుండా వదిలేస్తే అంతకంటే ఎక్కువ దారుణంగానే ఉంటాయని తెలిసింది.

మేకప్ బ్రష్ గురించి పరిశోధనలు చేసినవారు మేకప్ బ్రష్ శుభ్రం చేయకపోతే.. ఎన్నోరోజుల పాటు శుభ్రం చేయకుండా వదిలేసిన టాయిలెట్ సీట్ అంత దారుణంగా ఉంటుందట. ఈ మేకప్ బ్రష్ ల ద్వారా బాక్టీరియా, మృతచర్మం తాలూకూ కణాలు, బ్రష్ లో పేరుకుపోయిన నూనెలు మేకప్ తో పాటు ముఖాన్ని ఆవరించి చాలా తొందరగా ముఖాన్ని పాడుచేస్తాయని తెలిసింది.

చాలామంది అమ్మాయిలకు ముఖం మీది చర్మం ఇన్ఫెక్షన్లు, మొటిమలు, దద్దుర్లు వంటివి రావడం వెనుక ఈ మేకప్ బ్రష్లు శుభ్రంగా లేకపోవడం కూడా ఒక కారణం అని అంటున్నారు. ఈ సమస్య నుండి దూరంగా ఉండాలంటే.. వారానికి ఒకసారి తప్పకుండా మేకప్ బ్రష్ లు శుభ్రం చేసుకోవాలి.  కాబట్టి మేకప్ వేసుకునే మగువలు మేకప్ సెలక్షన్, బ్రష్ ల సెలక్షన్, మేకప్ తొలగించడం వీటి గురించి మాత్రమే కాదు. కాస్త ఆ బ్రష్ గురించి కూడా పట్టించుకుంటూ ఉండాలి.

                                  ◆నిశ్శబ్ద.