పారదర్శక నగలు

 

పారదర్శక నగలు

మోడ్రన్ డ్రస్సు లలో ఎన్నెన్నో వెరైటీలు వస్తున్నాయి. మరి అందుకు తగ్గట్టు ధరించే నగలలో రాకపోతే ఎలా?  అందులోనూ ఇప్పటి అమ్మాయిలు  సింపుల్‌గా, మోడ్రెన్‌గా, చూడగానే ఇట్టే ఆకర్షించేలా వుండే ఆభరణాలనే ఇష్టపడుతున్నారు . అలా అమ్మాయిల మనసుకి అద్దం పడుతూ, వారిని అలరిస్తున్నాయి "లూసైట్ " తరహా ఆభరణాలు. గాజు నగల మాదిరిగా  రెండు వైపులా పారదర్శకంగా వుండి, మధ్యలో రకరకాల డిజైన్లు ఉండటమే వీటి ప్రత్యేకత. రకరకాల రంగులలో దొరకటం, పైగా ఇయర్ టాప్స్ నుంచి బ్రేస్‌లెట్దాకా అన్ని రకాల యాక్ససరీస్ ఇందులో లభిస్తాయి. ఈసారి షాపింగ్‌కి వెళ్ళినప్పుడు మర్చిపోకుండా ఈ పారదర్శక నగలని కొనుక్కోండి.

 

-రమ